ఓటీటీలోకి ఆస్కార్ ఎంట్రీ పొందిన జాన్వీ కపూర్ మూవీ.. 8.1 ఐఎండీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ డేట్‌పై బజ్!
ఇండియా నుంచి 2026 ఆస్కార్ కు అఫీషియల్ గా ఎంట్రీ పొందిన జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ హోమ్ బౌండ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురైన జాన్వీ తెలుగులో ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది మూవీ చేస్తోంది. మరోవైపు ఆమె నటించిన హోమ్ బౌండ్ సినిమా వచ్చే ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ వైరల్ గా మారింది.

హోమ్ బౌండ్ ఓటీటీ
జాన్వీ కపూర్ లేటెస్ట్ హూవీ హోమ్ బౌండ్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీ సాధించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోమ్ బౌండ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకే రానుంది. కానీ స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదే రిలీజ్ డేట్
హోమ్ బౌండ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 2026 ఆస్కార్ కు ‘బెెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో హోమ్ బౌండ్ మూవీకి నామినేషన్ దక్కింది. అ సినిమాకు ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.
ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో
హౌమ్ బౌండ్ మూవీ థియేటర్లకు రాకముందే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఈ చిత్రానికి స్టాండింగ్ వెకేషన్ దక్కింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ అపూర్వ స్పందన దక్కించుకుంది. చివరకు ఇది సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఈ మూవీకి నీరజ్ డైరెక్టర్. ఇందులో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కీ రోల్స్ ప్లే చేశారు.
హౌమ్ బౌండ్ కథ
ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే సమాజంలో గౌరవం దక్కుతుందనే పోరాడే ఇద్దరు స్నేహితుల కథ హోమ్ బౌండ్. షోయబ్ అలీ (ఇషాన్), చందన్ కుమార్ (విశాల్) మంచి ఫ్రెండ్స్. వీళ్లలో ఒకరు ముస్లిం, మరొకరు ఎస్సీ. అవమానాలు ఎదుర్కొంటూ పెరుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అయితే మరింత గౌరవం దక్కుతుందని అనుకుంటారు.
రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాస్తారు షోయబ్, చందన్. ఫలితాలు లేట్ కావడంతో షోయబ్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో జాయిన్ అవుతాడు. సుధా (జాన్వీ) కోసం చందన్ కాలేజీకి వెళ్తాడు. అయితే షోయబ్, చందన్ మధ్య గొడవ జరుగుతుంది. మరి ఆ గొడవ ఎందుకు? చివరకు ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

E-Paper












