ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం రొమాంటిక్ మూవీ.. హీరోయిన్ కు డిజార్డర్.. ఇక్కడ చూసేయండి
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ హిట్ మూవీ ‘కె ర్యాంప్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డిజార్డర్ తో తిప్పలు తెచ్చే హీరోయిన్ తో హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది ఫన్నీగా ఉంటుంది.
ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు కిరణ్ అబ్బవరం. అతని లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘కె ర్యాంప్’ థియేటర్లో అదరగొట్టింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కె ర్యాంప్ ఇవాళ (నవంబర్ 15) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వివరాలపై ఓ లుక్కేయండి.

కె ర్యాంప్ ఓటీటీ
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ సూపర్ హిట్ మూవీ కె ర్యాంప్ ఓటీటీలో అడుగుపెట్టింది. శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. కడుపుబ్బా నవ్వించే రొమాంటిక్ కామెడీ మూవీ ఇది.
నెల రోజుల్లోపే
కె ర్యాంప్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ డెబ్యూ చేసింది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 18, 2025న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మంచి ఫన్ ఎలిమెంట్స్ తో పాటు రొమాన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి థియేటర్లో మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు నెల రోజుల తర్వాత కె ర్యాంప్ ఓటీటీలోకి వచ్చేసింది.
డెబ్యూ డైరెక్టర్
కె ర్యాంప్ మూవీ డైరెక్టర్ జైన్స్ నాని. అతనికి దర్శకుడిగా ఇదే ఫస్ట్ సినిమా. ఇందులో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. గతేడాది ‘క’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దిల్ రూబా’తో ఫ్లాప్ అందుకున్నాడు కిరణ్. ఇప్పుడు కె ర్యాంప్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.
కె ర్యాంప్ కథ
అల్లరిచిల్లరిగా తిరిగే ఓ రిచ్ అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, ఆమెకు ఓ మానసిక వ్యాధి ఉండటం చుట్టూ సాగే కథనే కె ర్యాంప్. కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఓ రిచ్ ఫ్యామిలీలో పుడతాడు. చిన్నప్పటి నుంచి బలాదూర్ గా తిరుగుతాడు. చదువు ఎక్కదు. ఎంసెట్ కూడా ఫెయిల్ అవుతాడు. అయితే ఓ జ్యోతిష్యుడి సలహాతో కుమార్ ను కేరళలోని కాలేజీలో జాయిన్ చేస్తాడు తండ్రి.
అమ్మాయితో లవ్
కేరళలో కూడా కుమార్ అలాగే తాగుతూ బలాదూర్ గా తిరుగుతాడు. అప్పుడే ఒక రోజు ఇబ్బంది పడుతున్న కుమార్ ను మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) కాపాడుతుంది. తన కాలేజీలోనే చదువుతున్న మెర్సీతో లవ్ లో పడతాడు కుమార్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అప్పుడే మెర్సీకి ఉన్న మానసిక సమస్య గురించి తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


