ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా- 8.3 రేటింగ్- హీరోయిన్ మానసిక సమస్యతో హీరోకు కష్టాలు!

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా చిత్రం కె ర్యాంప్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా జంటగా నటించారు. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ ఉంది. మరి కె ర్యాంప్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Nov 14, 2025, 14:06:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాలు వస్తూ సందడి చేస్తుంటాయి. ఓటీటీ ఆడియెన్స్‌ను తెగ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. వాటిలో అన్ని రకాల జోనర్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక ఇవాళ అయితే ఏకంగా 23 వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా- 8.3 రేటింగ్- హీరోయిన్ మానసిక సమస్యతో హీరోకు కష్టాలు!
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా- 8.3 రేటింగ్- హీరోయిన్ మానసిక సమస్యతో హీరోకు కష్టాలు!

కె ర్యాంప్ ఓటీటీ

ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో అంటే రేపు (నవంబర్ 15) తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ డ్రామా చిత్రం ఓటీటీ రిలీజ్ కానుంది. ఆ సినిమానే కె ర్యాంప్. హీరో కిరణ్ అబ్బవరం, బ్యూటిఫుల్ యుక్తి తరేజా జంటగా నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు.

దీపావళి సందర్భంగా

రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలుగా వ్యవహరించిన కె ర్యాంప్ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు సాయి కుమార్, వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన కె ర్యాంప్ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది.

మొదట అలా, తర్వాత ఇలా

థియేట్రికల్ రిలీజ్ అయిన కె ర్యాంప్ సినిమాకు మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, తర్వాత రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ మంచి టాక్‌తో హిట్ తెచ్చుకుంది. రొటీన్ లవ్ స్టోరీ అయినప్పటికీ టేకింగ్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్, సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరో పడే కష్టాలు

అలాగే, కె ర్యాంప్ సినిమాలో ఫుల్ ఎంటర్‌టైనింగ్ కామెడీ ఉందని, హీరోయిన్‌కు ఉన్న మానసిక సమస్యతో హీరో పడే కష్టాలు తెగ నవ్వించాయని రివ్యూలలో చెప్పారు. మరి అలాంటి కె ర్యాంప్ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

ఆహా ఓటీటీలో

ఆహాలో కె ర్యాంప్ ఓటీటీ రిలీజ్ కానుంది. నవంబర్ 15 అర్థరాత్రి నుంచి కె ర్యాంప్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కాగా, ఇటీవలే కె ర్యాంప్ సినిమాకు ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐఎమ్‌డీబీ రేటింగ్

బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన కె ర్యాంప్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.3 రేటింగ్ వచ్చింది. ఇంత మంచి రేటింగ్ సాధించిన కె ర్యాంప్ సినిమాను థియేటర్లలో మిస్ అయినవాల్లు రేపటి నుంచి ఆహా ఓటీటీలో కె ర్యాంప్ మూవీని ఎంచక్కా చూసేయండి.

కె ర్యాంప్ కథ

ఇక కె ర్యాంప్ సినిమా కథ విషయానికొస్తే.. హీరో ధనవంతుడి కొడుకు. ఫ్రెండ్స్‌తో అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. కొడుకు దారిలోకి రావడానికి కేరళలోని ఓ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు తండ్రి. అక్కడ హీరోయిన్‌తో లవ్‌లో పడిన హీరో పెళ్లి వరకు వెళ్తాడు. ఆ తర్వాత హీరో జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏంటీ అనేదే కె ర్యాంప్ స్టోరీ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More