ఓటీటీలోకి నిన్న రిలీజైన కాంత- హీరో, డైరెక్టర్ ఇగో గొడవ- హీరోయిన్ మర్డర్‌తో మలుపు తిరిగే సినిమా- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి నిన్న థియేటర్లలో విడుదలైన కాంత ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో కాంత ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ న్యూస్ వ్యాపిస్తోంది.

Published on: Nov 15, 2025, 06:06:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి సినిమాలు అతివేగంగా వచ్చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన ఓ సినిమా హిట్ అయిన ఫ్లాప్‌ను మూటగట్టుకున్న నెల రోజులు లేదా 2 నెలల లోపే ఓటీటీ రిలీజ్ అవుతోంది. ఇలాంటి తరుణంలో థియేట్రికల్ రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్టింగ్ అతిగా పెరిగిపోయింది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన కాంత- హీరో, డైరెక్టర్ ఇగో గొడవ- హీరోయిన్ మర్డర్‌తో మలుపు తిరిగే సినిమా- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన కాంత- హీరో, డైరెక్టర్ ఇగో గొడవ- హీరోయిన్ మర్డర్‌తో మలుపు తిరిగే సినిమా- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై

ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైన మూవీ కాంత ఓటీటీపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. కాంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇకపోతే కాంత సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, పాపులర్ నటుడు, దర్శకుడు సముద్ర ఖని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు.

హీరో డైరెక్టర్ గొడవలు

ఎక్కువగా దుల్కర్, సముద్రఖని పాత్రల చుట్టూనే సినిమా సాగుతుంది. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే క్రియెటివ్ డిఫరెన్స్, వారి ఇగో గొడవ, ఇద్దరి మధ్య ఉన్న గురు శిష్యుల సంబంధం వైరంగా ఎలా మారింది, సడెన్‌గా హీరోయిన్ మర్డర్‌తో కథ ఎలాంటి మలుపు తిరిగింది అనే అంశాలతో థ్రిల్లింగ్, డ్రామాతో కాంత తెరకెక్కింది.

నిర్మాతలుగా హీరోలు

సినిమాపైనే సినిమాను కాంతతో చూపించిన దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. ఆయన ఇదివరకు నీల సినిమాతో ఆకట్టుకున్నారు. కాంత సినిమాను స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ పతాకాలపై హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌లు నిర్మించారు.

కాంత మూవీ బడ్జెట్

జేక్స్ బిజోయ్ బీజీఎమ్ అందించగా.. జాను చందర్ సంగీతం అందించారు. ఇకపోతే కాంత సినిమాకు అన్ని ఖర్చులతో కలిపి రూ. 33 కోట్ల బడ్జెట్ అయినట్లు టాక్. ప్రమోషన్స్‌తో, పెద్ద నటీనటులతో తెరకెక్కిన కాంత సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది.

కాంత మూవీ టాక్

ఈ క్రమంలోనే నిన్న (నవంబర్ 14) తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కాంత సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దుల్కర్ సల్మాన్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే, సముద్ర ఖని, రానా దగ్గుబాటితోపాటు భాగ్యశ్రీ బోర్సే నటనలను రివ్యూవర్స్, ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు.

కాంత ఓటీటీ రైట్స్

ఇంతటి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోన్న కాంత ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ మొదలైంది. కాంత ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మంచి ధర వెచ్చించి సొంతం చేసుకుందని సమాచారం. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌లోనే కాంత ఓటీటీ రిలీజ్ కానుందని టాక్.

కాంత ఓటీటీ రిలీజ్

కాంత మూవీకి వచ్చే టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కాంత ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More