ఓటీటీలో ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ షురూ.. దెయ్యాల బంగ్లాలో పోలీస్ స్టేషన్
ఇటీవలి కాలంలో మలయాళ సినిమాలు హిస్టరీ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా వెబ్ సిరీస్ తోనూ రికార్డు నమోదు చేసేందుకు ఆ ఇండస్ట్రీ ప్రయత్నించింది. మొట్టమొదటి మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలోకి రిలీజైంది.
ఓటీటీలోకి ఇవాళ ఓ మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఫస్ట్ మలయాళ హారర్ కామెడీ సిరీస్ గా చెబుతున్న ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 14)న ఈ సిరీస్ రిలీజైంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో ఇక్కడ చూసేయండి.
ఓటీటీలో హారర్ కామెడీ సిరీస్ (x)
ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఓటీటీ
మలయాళం సినీ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. రీసెంట్ గా లోకా మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. మలయాళం సిరీస్ లు కూడా ఓటీటీలో అదరగొడుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు హారర్ కామెడీ జోనర్లో ఫస్ట్ మలయాళం సిరీస్ ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’ అని చెబుతున్నారు. దీంతో ఈ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫస్ట్ మలయాళ సిరీస్
మలయాళం నుంచి చాలా సిరీస్ లో ఓటీటీలోకి వచ్చాయి. అయితే హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో మాత్రం ఇన్‌స్పెక్షన్ బంగ్లా ఫస్ట్ సిరీస్ అని అంటున్నారు. ఈ సిరీస్ కు సైజు ఎస్ఎస్ డైరెక్టర్. ఇందులో శబరీష్ వర్మ, ఆధ్య ప్రసాద్, సెంథిల్, రాజమణి, షాజు శ్రీధర్, జయన్, వీణ నాయర్, శ్రీజిత్ రవి, బాలాజి శర్మ, మనోహరి జాయ్ తదితరులు నటించారు.
ఇన్‌స్పెక్షన్ బంగ్లా కథ
ఇన్‌స్పెక్షన్ బంగ్లా అనేది ఓ దెయ్యాల కొంపలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కింది. ఇది 7 ఎపిసోడ్ల సిరీస్. విష్ణు (శబరీష్ వర్మ) ఓ సబ్ ఇన్ స్పెక్టర్. గతం తాలూకు జ్ణాపకాలు అతణ్ని వెంటాడుతుంటాయి. నిషేధిత ప్రభుత్వ ఆస్తి అయిన లోకల్ బంగ్లాలోకి పోలీస్ స్టేషన్ ను తరలించాలని అతనికి ఆదేశాలు వస్తాయి. అక్కడ అందరూ దాన్ని ఇన్‌స్పెక్షన్ బంగ్లా అని పిలుస్తారు.
వింత సంఘటనలపై రీసెర్చ్ చేసే పారానార్మల్ రీసెర్చర్ మైథిలి (ఆధ్య ప్రసాద్)తో టీమ్ ను సెట్ చేస్తాడు. తన పోలీస్ గ్యాంగ్, మైథిలితో కలిసి ఆ ఇన్‌స్పెక్షన్ బంగ్లాలోకి వెళ్తాడు శబరీస్. అక్కడ అంతా అబ్ నార్మల్ గా ఉంటుంది. ఓ వైపు భయంతో మంచి కామెడీ పండుతుంది. మరోవైపు దెయ్యం వేట కొనసాగుతుంది. అప్పుడే ఆ ఇన్‌స్పెక్షన్ బంగ్లా రహస్యాలు బయటపడతాయి. మరి ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం ఎవరు? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.