లవ్ ఓటీపీ రివ్యూ.. ఓవర్ టార్చర్ ప్రెజర్ పెట్టే లవర్.. టాక్సిక్ రిలేషన్‌షిప్‌ను కామెడీతో చూపించిన సినిమా ఎలా ఉందంటే?
అనీష్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ ఓటీపీ. జాన్విక హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. విజయ్ ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి లవ్ ఓటీపీ రివ్యూలో తెలుసుకుందాం.
హీరోగా, డైరెక్టర్‌గా ఒకేసారి పరిచయం అయ్యారు అనీష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ లవ్ ఓటీపీ. విజయ్ ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్విక నటించింది. అలాగే, నటుడు రాజీవ్ కనకాల, ఆరోహి నారాయణ్, ప్రమోదిని, నాట్య రంగ, బాబా భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

శ్రీమతి పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇవాళ (నవంబర్ 14) లవ్ ఓటీపీ సినిమా థియేటర్లలో, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి లవ్ ఓటీపీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అక్షయ్ (అనీష్)కు క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. అక్షయ్ తండ్రి (రాజీవ్ కనకాల) పోలీస్ ఆఫీసర్. లవ్ అంటే ఏమాత్రం పడదు. అందుకే ప్రేమ పేరుతో వచ్చే కేసులను చాలా స్పెషల్ కేర్ తీసుకుంటాడు. తండ్రి మీద భయంతో అక్షయ్ ఎవరిని ప్రేమించడు. కానీ, కాలేజ్‌లో అక్షయ్‌ను ఇష్టపడ్డ సన (ఆరోహి నారాయణ్) లవ్ పేరుతో ఎంట్రీ ఇస్తుంది.
అక్షయ్‌కు ప్రపోజ్ చేయడం, చేయకుండా సూసైడ్ చేసుకొంటానంటుంది. ఈ క్రమంలో క్రికెట్‌లో దెబ్బ తగిలినప్పుడు అక్షయ్‌కు ఫిజియో థెరపిస్ట్ నక్షత్ర (జాన్విక) పరిచయం అవుతుంది. సన గర్ల్‌ఫ్రెండ్ ఉండగానే నక్షత్రను ప్రేమిస్తాడు.
ఆ తర్వాత ఏమైంది? నక్షత్రతో అక్షయ్ లవ్ ట్రాక్ తెలిసిన సన ఏం చేసింది? తండ్రికి రెండు లవ్ స్టోరీస్ గురించి తెలియకుండా ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి అక్షయ్ ఎవరితో కలిసి ఉంటాడు? సన ఎలాంటి టార్చర్ పెట్టింది? వంటి విషయాలు తెలియాలంటే? ఈ లవ్ ఓటీపీ చూడాల్సిందే.
విశ్లేషణ:
లవ్ ఓటీపీలో ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెజర్. సినిమా కూడా ఇలాగే ఉంటుంది. అసలు ఏమాత్రం ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించడం, లవ్‌లో ఆమెతో పడే కష్టాలు, నిజంగా ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో చేసే ప్రయత్నాలతో మూవీ సాగుతుంది.
ఇద్దరి లవర్స్ మధ్య నలిగిపోయే హీరో కథగా లవ్ ఓటీపీ ఉంది. టాక్సిక్ రిలేషన్‌షిప్, ఒకరి అభిప్రాయాలను మరొకరిపై రుద్దడం వంటి లవ్‌లో జరిగే విషయాలపై ఈ సినిమా తెరకెక్కించారు. పూర్తిగా కామెడీతో ప్రేక్షకుడిని నవ్వించేలా సినిమా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. అక్కడే కథ కొత్త మలుపు తీసుకుంటుంది.
దాంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక రెండో భాగంలో హీరో ఒకేసారి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను మెయింటేనే చేయడం, దాంతో కలిగే ఇబ్బందులు, కష్టాలు కామెడీతోపాటు ఎమోషనల్‌గా ఉంటాయి. సనను వదిలేయకపోవడం, నక్షత్రతో పూర్తిగా ప్రేమగా ఉండలేకపోవడం వంటివి ఒక అబ్బాయికి ఎలాంటి బాధను కలిగిస్తాయో చక్కగా చూపించారు.
ప్రీ క్లైమాక్స్ నుంచి
అయితే, ప్రీ క్లైమాక్స్ నుంచి కాస్తా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది. డైరెక్టర్‌గా, హీరోగా అనీష్ బాగానే హ్యాండిల్ చేశాడని అనిపించింది. పూర్తి సాడ్ ఫీల్‌లోకి కాకుండా అలాగే కామెడీతో మెయింటేన్ చేస్తే బాగుండేది. హీరోగా అభినయం బాగుంది.
ఇక హీరోయిన్స్‌గా చేసిన జాన్విక, ఆరోహి నారాయణ్ పూర్తిగా మెప్పించారు. ఇద్దరు తమ పాత్రలతోపాటు గ్రామర్‌తో అట్రాక్ట్ చేశారు. రాజీవ్ కనకాల నటన నచ్చుతుంది. తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. మిగతా పాత్రలంతా మెప్పిస్తారు. సంగీతం పర్వాలేదు. విజువల్స్ బాగున్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే
ఇతర సాంకేతిక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే టాక్సిక్ రిలేషన్‌షిప్, ఇద్దరు లవర్స్‌ను ఒకేసారి మెయింటేన్ చేస్తే వచ్చే కష్టాలపై తెరకెక్కిన లవ్ ఓటీపీ ఆద్యంతం నవ్వించిన చివరికి ఏడిపిస్తుంది.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


