అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా.. రామ్ పోతినేని మూవీ స్ట్రీమింగ్ ఆ రోజే!

రామ్ పోతినేని లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలోకి రాబోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి, ఎప్పుడొస్తుందో ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 20, 2025, 13:56:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ సినిమా ఫ్యాన్ బయోపిక్ గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా రాబట్టలేకపోయింది.

ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ (x/Netflix_INSouth)
ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ (x/Netflix_INSouth)

ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ

రీసెంట్ టైమ్స్ లో తెలుగులో మంచి హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఆంధ్రా కింగ్ తాలూకా ఒకటి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ప్రతి ఫ్యాన్ కూడా ఇది తన బయోపిక్ అనుకునేలా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (డిసెంబర్ 20) అనౌన్స్ చేసింది.

అయిదు భాషల్లో

ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ అయిదు భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ పి.మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న థియేటర్లలో రిలీజైంది. ఇందులో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించాడు. వీళ్లతో పాటు రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.

ఆంధ్ర కింగ్ తాలూకా కథ

సాధారణంగా సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఓ ఫ్యాన్ కథనే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా. ఇందులో సూర్య (ఉపేంద్ర) ఓ సూపర్ స్టార్ హీరో. అతణ్ని ఆంధ్రా కింగ్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అతనికి సాగర్ (రామ్) వీరాభిమాని. సూర్య సినిమా అంటే చాలు చొక్కా చింపుకునేంత అభిమానం.

అయితే సూర్య వందో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు సూర్యకు రూ.3 కోట్ల సాయం కావాల్సి వస్తుంది. ఆ సమయంలోనే సాగర్ తన హీరో సూర్య కోసం రూ.3 కోట్లు పంపిస్తాడు. సూర్యకు అంత డబ్బు ఎందుకు అవసరం వచ్చింది? సాగర్ ఏ త్యాగం చేశాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More