ఓటీటీలోకి నిన్న రిలీజైన యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల మోగ్లీ- 8.3 రేటింగ్- నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహాలో కాదు- ఎక్కడంటే?

నిన్న (డిసెంబర్ 13) థియేటర్లలో విడుదలైన మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫారెస్ట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా చేశారు. నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహాలలో కాకుండా మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 14, 2025, 19:00:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇలా థియేట్రికల్ రిలీజ్ కాగానే ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంటుంది. అందుకే లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలపై బజ్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలకృష్ణ అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు మరో సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటీటీ ఆడియెన్స్.

ఓటీటీలోకి నిన్న రిలీజైన యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల మోగ్లీ- 8.3 రేటింగ్- నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహాలో కాదు- ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల మోగ్లీ- 8.3 రేటింగ్- నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహాలో కాదు- ఎక్కడంటే?

నేషనల్ అవార్డ్ విన్నర్

ఆ సినిమానే మోగ్లీ 2025. స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమానే ఇది. ఈ సినిమాకు కలర్ ఫొటో డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. మోగ్లీ సినిమాలో రోషన్ కనకాలకు జోడీగా సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా చేసింది.

మోగ్లీ కీలక పాత్రలు

అలాగే, మోగ్లీ సినిమాలో విలన్‌గా డైరెక్టర్, నటుడు బండి సరోజ్ కుమార్ నటించాడు. వీరితోపాటు వైవా హర్ష, కృష్ణ భగవాన్ కీలక పాత్రలు పోషించారు. హీరో సుహాస్, రియా సుమన్ గెస్ట్ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

మోగ్లీ మూవీపై రెస్పాన్స్

డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన మోగ్లీ 2025 మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. రొటీన్ లవ్ స్టోరీ అయినప్పటికీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన విధానం బాగుందని కామెంట్స్ వినిపించాయి. కొన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపించాయని టాక్ వినిపించింది.

మోగ్లీ రివ్యూస్

అయితే, రామాయణం, కర్మ సిద్ధాంతానికి ముడిపెడుతూ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీని డైరెక్టర్ సందీప్ రాజ్ చెప్పాడని రివ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి మోగ్లీ సినిమాకు పదికి 8.3 రేటింగ్ కూడా వచ్చింది. ఇలాంటి మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

మోగ్లీ ఓటీటీ రైట్స్

అయితే, మోగ్లీ ఓటీటీ రైట్స్‌ దిగ్గజ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహా ప్లాట్‌ఫామ్స్‌కు వెళ్లలేదు. అచ్చ తెలుగు కంటెంట్ అందించే ఈటీవీ విన్ మోగ్లీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. మంచి ధర వెచ్చించి మరి మోగ్లీ 2025 ఓటీటీ రైట్స్‌ను ఈటీవీ విన్ దక్కించుకుందట.

ఈటీవీ విన్ ఓటీటీలో

ఈ లెక్కన ఈటీవీ విన్‌లో మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు నుంచి 6 వారాల గ్యాప్‌లో ఈటీవీ విన్‌లో మోగ్లీ ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. అంటే నిన్న థియేటర్లలో విడుదలైన మోగ్లీ సుమారు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More