శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

కీర్తి సురేష్, సుహాస్ నటించిన మూవీ ఒకటి నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీని కొన్ని రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేయగా.. గురువారం (జూన్ 19) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఫన్నీగా సాగింది.

Published on: Jun 19, 2025, 16:37:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ టాలీవుడ్ నటీనటులు కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న మూవీ ఉప్పు కప్పురంబు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ ఇది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. శ్మశానంలో స్థలం కోసం కొట్టుకునే ఊరు, వాళ్ల మధ్య నలిగిపోయే సర్పంచ్ పాత్రలో కీర్తి సురేష్ ను ఇందులో చూడొచ్చు. ఈ సెటైరికల్ కామెడీ ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది.

కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
కీర్తి సురేష్, సుహాస్ మూవీ నేరుగా ఓటీటీలోకి.. ఫన్నీగా ట్రైలర్.. శ్మశానానికి హౌస్‌ఫుల్ బోర్డు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఉప్పు కప్పురంబు ట్రైలర్

ఉప్పు కప్పురంబు మూవీ ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో గురువారం (జూన్ 29) రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ మొదట్లోనే సుబ్బరాజు అనే ఊరి పెద్ద మరణించినట్లు చూపించారు. ఆ తర్వాత అతని కూతురు పాత్ర పోషించిన కీర్తి సురేష్ ఆ ఊరి పెద్ద అవుతుంది. అసలు ఏమీ తెలియని ఆమెకు అక్కడంతా గందరగోళంగా అనిపిస్తుంది.

ఇదే సమయంలో ఆ ఊరి శ్మశానంలో స్థలం అయిపోయిందని, మరో నాలుగు శవాలను మాత్రమే పూడ్చే అవకాశమే ఉందంటూ.. ఆ ఊరి వ్యక్తి (సుహాస్) ఆమె దృష్టికి తీసుకొస్తాడు. ఇక అక్కడ మొదలవుతుంది అసలు యుద్ధం. ఆ ఊళ్లోని రెండు వర్గాలు ఆ శ్మశానంలో మిగిలిన స్థలాల కోసం కొట్టుకుంటారు.

లక్కీ డ్రా కూడా వేస్తారు. ఇక ట్రైలర్ చివర్లో ఎవరూ చావవద్దని మనవి అనే డైలాగుతోపాటు శ్మశానికి హౌస్‌ఫుల్ బోర్డు కూడా పెట్టడం ఫన్నీగా అనిపిస్తుంది. రెండు నిమిషాల 5 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మొత్తం నవ్విస్తూనే సాగింది. ఆ లెక్కన మూవీ కూడా కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉప్పు కప్పురంబు మూవీ గురించి..

కీర్తి సురేష్, సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. ఈ మూవీకి ఐవి శశి దర్శకత్వం వహించాడు. ఉప్పు కప్పురంబు సినిమాలో ఈ ఇద్దరితోపాటు బాబు మోహన్, శత్రు, తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు.

వసంత్ మారింగంటి రచించిన ఉప్పు కప్పురంబు సినిమా 1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా తెరకెక్కింది. చిట్టి జయపురం అనే కల్పిత గ్రామంలో జరిగిన కథగా మూవీని తీశారు. ఈ సినిమా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో రానుండటం విశేషం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More