రాజమౌళి స్టైలే వేరు.. ఈవెంట్‌కూ సినిమా రేంజ్ సిట్టింగ్స్, ప్రమోషన్స్.. సుమ కనకాలతో జక్కన్న అండ్ టీమ్ ప్లానింగ్
సినిమాలు తీయడమే కాదు.. వాటిని ఎలా ప్రమోట్ చేయాలో బహుశా రాజమౌళికి తెలిసినట్లుగా ప్రపంచంలో మరెవరికీ తెలియదేమో. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం జక్కన్న ప్లానింగ్ ఆ స్థాయిలో ఉంది. సినిమా స్టోరీ సిట్టింగ్స్ కంటే ఎక్కువ ప్లానింగ్ ఈ ఈవెంట్ కోసం నడుస్తోంది.
రాజమౌళి స్టైలే వేరు. సినిమాలు అందరూ తీస్తారు. కానీ వాటిని ప్రమోట్ చేయడం ఎలాగో మాత్రం జక్కన్నను చూసే నేర్చుకోవాలేమో. మహేష్ బాబుతో తాను తీయబోయే నెక్ట్స్ మూవీ గ్లోబ్‌ట్రాటర్ బిగ్ రివీల్ ఈవెంట్ నే ఓ పెద్ద పండగలా చేయడానికి అతడు ప్లాన్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ప్లానింగ్ ఇలా..
రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీని తాత్కాలికంగా గ్లోబ్‌ట్రాటర్ అని పిలుస్తున్న విషయం తెలుసు కదా. దీనికి అర్థం ప్రపంచాన్ని చుట్టేసే సంచారి అని. ఈ మూవీ నుంచి ఏదో పెద్ద విషయాన్నే రివీల్ చేస్తామంటూ శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికోసం ఏకంగా 100 అడుగుల ఎల్ఈడీ తెరను నిర్మించారు. ఈ ఈవెంట్ కోసం పాస్‌లు ఇవ్వడమే కాదు.. ఎలా రావాలి, ఏం చేయాలన్నది వివరిస్తూ అభిమానుల కోసం రాజమౌళే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ఇక ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి అతని టీమ్ పెద్ద ప్లానే చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ ను హోస్ట్ చేయబోతున్న యాంకర్ సుమ కనకాల, యూట్యూబర్ ఆశిష్ చంచలానీలతో కలిసి రాజమౌళి, కీరవాణి అండ్ టీమ్ ప్లానింగ్ చేయడం ఆ ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఈవెంట్ కోసమే వాళ్లు ఓ సినిమా స్టోరీ సిట్టింగ్ రేంజ్ లో ప్లాన్ చేస్తుండటం విశేషం. అసలు ఏం రివీల్ చేయబోతున్నారో కూడా తెలియని ఓ మూవీ ఈవెంట్ కోసం దేశంతో ఈ స్థాయిలో బజ్ నెలకొనడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. అది రాజమౌళికే సాధ్యం.
గ్లోబ్‌ట్రాటర్ పాస్‌పోర్ట్ ఇలా..
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం పాస్ తప్పనిసరి అని చెప్పి వాటిని జారీ చేస్తున్నారు. అయితే దానిపై పాస్‌పోర్ట్ అని ఉండటం విశేషం. ఒక్క పేజీతో కాకుండా బుక్‌లెట్ రూపంలో ఇది ఉంది. దీని లోపల ఈవెంట్ డేట్, ఆ తర్వాత మహేష్, రాజమౌళి, ప్రియాంకా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫొటోలు, వచ్చే అభిమానులకు సూచనలు, చివరి పేజీలో రూట్ మ్యాప్, వివిధ సూచనలు చూపించే క్యూఆర్ కోడ్ ఉంచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ పాస్ కాదు పాస్‌పోర్ట్ అంటూ పలువురు వీటిని షేర్ చేసుకుంటున్నారు.
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్.. రాజమౌళి మెసేజ్
ఇక ఈ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ కోసం రావాలనుకునే వారికి డైరెక్టర్ రాజమౌళి ఓ ప్రత్యేకమైన వీడియో ద్వారా పలు కీలకమైన సూచనలు చేసిన విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న జరగబోయే ఈ ఈవెంట్ ను చూడటానికి వచ్చే వారి దగ్గర కచ్చితంగా ఫిజికల్ పాస్ ఉండాల్సిందే అని స్పష్టం చేశాడు. నేరుగా వచ్చేస్తే పంపిస్తారు.. లేదంటే ఆన్‌లైన్ లో పాసులు ఉన్నాయి అనే ప్రచారాలను నమ్మొద్దనీ సూచించాడు.
ఇక ఈ ఈవెంట్ కోసం పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, 18 ఏళ్ల లోపు వారు, సీనియర్ సిటిజెన్స్ కు అనుమతి లేదని, వాళ్లందరూ జియోహాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలని చెప్పాడు. ఇక ఎక్కడి నుంచి వచ్చే వాళ్లు ఎలా రావాలో కూడా ఇదే వీడియోలో చెబుతూ.. ఆ వివరాలన్నీ ఈవెంట్ పాస్ లోనూ పొందుపరిచినట్లు రాజమౌళి వెల్లడించాడు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేద్దామని పిలుపునిచ్చాడు.
గ్లోబ్‌ట్రాటర్ గురించి..
రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ గ్లోబ్‌ట్రాటర్ మూవీ నుంచి ఇప్పటికే కుంభ, మందాకిని పాత్రల లుక్స్ రిలీజైన విషయం తెలిసిందే. కుంభ అనే విలన్ పాత్రలో సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంకా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. దీంతో మహేష్ బాబు లుక్ పై ఆసక్తి నెలకొంది.
అంతేకాదు ఈ బిగ్ ఈవెంట్ లో అసలు ఏం రివీల్ చేయబోతున్నారో అని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది తేలిపోనుంది. శనివారం (నవంబర్ 15) సాయంత్రం 7 గంటల నుంచి ఈ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


