గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్..ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి రిక్వెస్ట్‌..ఈవెంట్‌కు ఎలా రావాలంటే? ద‌య‌చేసి వాళ్లు రావొద్దంటూ వీడియో

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. గ్లోబ్‌ట్రాట‌ర్ పేరుతో సినిమా ఈవెంట్ ను నవంబర్ 15న నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 

Published on: Nov 13, 2025 12:53 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. దీనికి ఎస్ఎస్ఎంబీ29, గ్లోబ్‌ట్రాట‌ర్ అనే వర్కింగ్ టైటిల్స్ ఉన్నాయి. గ్లోబ్‌ట్రాట‌ర్ పేరుతో నవంబర్ 15న హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇందులో మూవీ పేరు, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ రాజమౌళి గురువారం (నవంబర్ 13) ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఎస్ఎస్ రాజమౌళి (x/ssrajamouli)
ఎస్ఎస్ రాజమౌళి (x/ssrajamouli)

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్

‘‘అందరికీ నమస్కారం. మన గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ కోసం మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మన సేఫ్టీ దృష్ట్యా పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్లు చాలా స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం కచ్చితంగా పాటించాలి’’ అని వీడియోలో రాజమౌళి తెలిపారు.

ఓపెన్ ఈవెంట్ కాదు

‘‘ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాస్ లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి. కొన్ని వీడియోల్లో అందరూ రావొచ్చు, అనుమతిస్తారని చెబుతున్నారు. అది తప్పు. ఫిజికల్ పాస్ లు ఉన్నవాళ్లే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేస్తారు’’ అని రాజమౌళి చెప్పారు.

ఎలా రావాలంటే?

‘‘విజయవాడ నుంచి వచ్చేవాళ్లు మెయిన్ గేట్ కంటే ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్ పూర్ వెళ్తుంది. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఈవెంట్ దగ్గరకు వస్తారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సంఘీ నగర్ మీదుగా రావొచ్చు.

గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఓఆర్ ఎగ్జిట్ నంబర్ 12 దగ్గర దిగి సర్వీస్ రోడ్ మీద నుంచి వస్తే ఈవెంట్ కు వచ్చేయొచ్చు. పాస్ మీద క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే క్లియర్ ఇన్ స్ట్రక్షన్స్ వస్తాయి. రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటాయి. షార్ట్ కట్ తెలుసు అనే ఫ్రెండ్ మాట వినొద్దు’’ అని రాజమౌళి సూచించారు.

వాళ్లు రావొద్దు

‘‘ఈవెంట్ దగ్గర గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓపెన్ చేసి ఉంటాయి. మీరు ఎర్లీగా వస్తే మంచి సీట్లు దొరుకుతాయి. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లకు, సీనియర్ సిటిజెన్స్ కు పోలీస్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంటి దగ్గరే ఉండి జియోహాట్ స్టార్ లో లైవ్ చూడండి.

రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ సారి పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ క్యాన్సిల్ చేయాలని కమిషనర్ పర్సనల్ గా చెప్పారు. వాళ్లకు పూర్తిగా సహకరించి ఈవెంట్ బాగా చేసుకుందాం. 15న కలుద్దాం’’ అని రాజమౌళి వీడియో ఎండ్ చేశారు.

News/Entertainment/గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్..ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి రిక్వెస్ట్‌..ఈవెంట్‌కు ఎలా రావాలంటే? ద‌య‌చేసి వాళ్లు రావొద్దంటూ వీడియో
News/Entertainment/గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్..ఫ్యాన్స్‌కు రాజ‌మౌళి రిక్వెస్ట్‌..ఈవెంట్‌కు ఎలా రావాలంటే? ద‌య‌చేసి వాళ్లు రావొద్దంటూ వీడియో