మోగ్లీ రివ్యూ- రామాయణం, కర్మ సిద్ధాంతానికి లింక్- యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల ఫారెస్ట్ లవ్ స్టోరీ మెప్పించిందా?
స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ సినిమా మోగ్లీ. కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‌గా బండి సరోజ్ కుమార్ యాక్ట్ చేశాడు. రామాయణానికి ముడిపెడుతూ తెరకెక్కిన మోగ్లీ ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మోగ్లీ రివ్యూలో చూద్దాం.
టైటిల్: మోగ్లీ

నటీనటులు: రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్, సాక్షి మడోల్కర్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, సుహాస్, రియా సుమన్ తదితరులు
దర్శకత్వం: సందీప్ రాజ్
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: రమ మారుతి
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేది: 13 డిసెంబర్ 2025
నందమూరి బాలకృష్ణ అఖండ 2 విడుదలతో ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా మోగ్లీ. స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి మడోల్కర్ చేసింది. నిర్భంధం, మాంగళ్యం సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్, నటుడు బండి సరోజ్ కుమార్ విలన్‌గా చేశాడు.
మోగ్లీ రివ్యూ
కలర్ ఫోటో డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహిత సందీప్ రాజ్ మోగ్లీ సినిమాకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో అతిపెద్ద బ్యానర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న మోగ్లీ ఇవాళ (డిసెంబర్ 13) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మోగ్లీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
అనాథ అయిన మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ లేదా కిట్టు (రోషన్ కనకాల)కు ఎస్సై కావాలనేది లక్ష్యం. అడవినే తల్లిగా భావించే మోగ్లీ అక్కడ షూటింగ్‌కు వచ్చేవాళ్లకు సహాయంగా ఉంటాడు. ప్రభాస్ బంటి (వైవా హర్ష)తో ఉంటూ జీవనోపాధి పొందుతాడు. ఈ క్రమంలో ఓ సినిమాలో డూప్‌గా నటించాల్సి వస్తుంది మోగ్లీ.
ఆ సినిమా టీమ్‌లోని డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్)తో ప్రేమలో పడతాడు కిట్టు. అయితే, జాస్మిన్ వినలేదు, మాట్లాడలేదు. అయినా ఇద్దరు ప్రేమలో పడతారు. మోగ్లీ రాముడు అయితే, జాస్మిన్ సీత అంటాడు కిట్టు. ఈ క్రమంలోనే సీతరాముల్లాంటి జోడీ మధ్యలోకి రావణుడిలా ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) ఎంట్రీ ఇస్తాడు.
ట్విస్టులు
జాస్మిన్ విషయం తెలిసి ఎలాగైనా వాడుకోవాలనుకుంటాడు క్రిస్టోఫర్ నోలన్. అందుకు ప్లాన్ వేస్తాడు. మరి రావణుడిలాంటి క్రిస్టోఫర్ నోలన్ నుంచి సీతలాంటి జాస్మిన్‌ను రాముడుగా చెప్పుకున్న మోగ్లీ కాపాడుకోగలిగాడా? ఈ క్రమంలో మోగ్లీకి ప్రభాస్ బంటి ఎలా సహాయం చేశాడు? కిట్టు, జాస్మిన్ ప్రేమ గెలిచిందా?, ఈ కథకు కర్మ సిద్ధాంతానికి ఉన్న లింక్ ఏంటీ? అనేది తెలియాలంటే మోగ్లీ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది ఒక ఫారెస్ట్ లవ్ స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు ఇదివరకు చాలానే వచ్చాయి. సందీప్ రాజ్ తెరకెక్కించిన కలర్ ఫొటో కూడా హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ, ఇబ్బంది పెట్టే పోలీస్ కథతోనే సాగుతుంది. మోగ్లీ కూడా అంతే. కానీ, ఈ సినిమాలో కర్మ సిద్దాంతాన్ని ఉపయోగించారు డైరెక్టర్ సందీప్ రాజ్.
సినిమాలోని క్యారెక్టర్స్‌ను రామాయణంలోని పాత్రలకు ముడిపెడుతూ కథనం సాగించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కౌట్ అయింది. తెలిసిన కథ అనిపించినా ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది. హీరో హీరయిన్ లవ్ ట్రాక్ బాగానే ఉంటుంది. అలాగే, క్రిస్టోఫర్ నోలన్ విలనిజం ఆకట్టుకుంటుంది. కానీ, ఒక దశ తర్వాత అతి వల్ల ఓవర్ ఫీలింగ్ కలుగుతుంది.
ఇంటర్వెల్ తర్వాత
దాదాపుగా సినిమా అంత ఊహించినట్లుగానే సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడందుంటుకుంటుంది. ఒక క్రమంలో వాన, జయం సినిమాలను మోగ్లీ తలపిస్తుంది. విలన్ నుంచి హీరోయిన్‌ను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, అందుకు సహకరించే ఫ్రెండ్ ఇవే అంశాలతో సినిమా సాగుతుంది.
క్లైమాక్స్ డిఫరెంట్‌గా ట్రై చేసినట్లు అనిపించింది. అది అందరికి కనెక్ట్ కాకపోవచ్చు. ఇకపోతే సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. అడవిలోని లొకేషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే ఓకే. ఇక హీరోగా రోషన్ కనకాల నటనతో చాలా బాగా మెప్పించాడు.
ప్రధానంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలితో రోషన్ ఆకట్టుకున్నాడు. గత సినిమాతో పోలిస్తే రోషన్ యాక్టింగ్‌లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా చాలా ఈజ్‌తో చేశాడు. చెవిటి, మూగగా సాక్షి మడోల్కర్ మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్రకు న్యాయం చేసింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే?
బండి సరోజ్ యాక్టింగ్ అదిరిపోయింది. కోపంగా సెటైరికల్‌గా ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో సుహాస్, రియా సుమాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఫైనల్‌గా చెప్పాలంటే కర్మ సిద్ధాంతంతో సాగే ఫారెస్ట్ లవ్ స్టోరీనే మోగ్లీ కథ.
రేటింగ్: 3/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


