బాలయ్య గర్జన- అదిరిపోయిన అఖండ 2 ఓపెనింగ్ కలెక్షన్స్- అఖండకు మించి వసూల్లు- ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' చిత్రం వారం రోజుల ఆలస్యం తర్వాత విడుదలైంది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ తొలి రోజునే రూ. 30 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ కలెక్షన్స్ చాలా ఎక్కువ. మరి తొలిరోజున అఖండ 2 కలెక్షన్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

Published on: Dec 13, 2025, 11:09:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణకు బాక్సాఫీస్ వద్ద ఆలస్యంగానైనా ఘన స్వాగతం లభించింది. వారం రోజులు వాయిదా పడిన ఆయన డివోషనల్ యాక్షన్ ఎపిక్ 'అఖండ 2: తాండవం' చిత్రం ఎట్టకేలకు శుక్రవారం (డిసెంబర్ 12) థియేటర్లలో విడుదలైంది.

బాలయ్య గర్జన- అదిరిపోయిన అఖండ 2 ఓపెనింగ్ కలెక్షన్స్- అఖండకు మించి వసూల్లు- ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలయ్య గర్జన- అదిరిపోయిన అఖండ 2 ఓపెనింగ్ కలెక్షన్స్- అఖండకు మించి వసూల్లు- ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఆశ్చర్యపరిచే కలెక్షన్స్

అఖండ 2 తాండవం సినిమా తొలి రోజునే (గురువారం ప్రివ్యూలతో కలిపి) అసాధారణ రీతిలో కలెక్షన్స్ రాబట్టి సినీ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ సంస్థ సక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం 'అఖండ 2' చిత్రానికి గురువారం (డిసెంబర్ 11) ప్రివ్యూల ద్వారానే రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

అఖండ 2 ఇండియా కలెక్షన్స్

ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లో నమోదైలన వసూల్లు మాత్రమే. ఇక విడుదలైన శుక్రవారం (డిసెంబర్ 12) అఖండ 2 తాండవం సినిమాకు ఇండియాలో రూ. 22.53 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ. 21.95 కోట్లు ఉండగా హిందీ బెల్ట్ ద్వారా రూ. 11 లక్షలు వచ్చాయి.

ఏరియాల వారీగా

అలాగే, కన్నడ నుంచి 3 లక్షలు, తమిళనాడులో 43 లక్షలు, మలయాళంలో 1 లక్ష కలెక్షన్స్ అఖండ 2 తాండవం సినిమాకు వసూలు అయ్యాయి. ఇక ప్రీవ్యూలు, ఓపెనింగ్ డే కలుపుకును అఖండ 2 సినిమా భారతదేశవ్యాప్తంగా రూ. 30.53 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

అఖండ పార్ట్ 1కి మించిన కలెక్షన్స్

వీటిలో తెలుగు స్టేట్స్ నుంచి రూ. 29.95 కోట్ల కలెక్షన్స్ వస్తే హిందీ నుంచి 11 లక్షలు, కన్నడ నాట 3 లక్షలు, తమిళంలో 43 లక్షలు, మలయాళంలో 1 లక్షగా ఉన్నాయి. అంటే, ఒక్క తెలుగులో స్టేట్స్‌లోనే ప్రీమియర్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే పార్ట్ 1 అఖండ కలెక్షన్స్‌కు మించి అఖండ 2 ఓపెనింగ్ వసూల్లు ఉండటం విశేషంగా మారింది.

అధిక సంఖ్యలో

అఖండ పార్ట్ 1 సినిమాకు తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.8 కోట్లు వస్తే వరల్డ్ వైడ్‌గా రూ. 29.60 కోట్లు వచ్చాయి. వీటికి అధిక సంఖ్యలో ఎక్కువగా అఖండ 2 సినిమాకు కేవలం ఇండియాలోనే రూ. 30.53 కోట్లు వచ్చాయి. కాగా, మొత్తం ఐదు వారాల్లో అఖండ పార్ట్ 1 సినిమాకు రూ. 89 కోట్లు వచ్చినట్లు సమాచారం.

అఖండ 2 సినిమా అంశాలు

ఇదిలా ఉంటే, అఖండ 2 సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. చైనా బయోవార్, హైందవ ధర్మం రక్షణ వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్‌గా ఆది పినిశెట్టి చేశాడు. హీరోయిన్‌గా బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ నటించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More