వామ్మో! అల్లు అర్జున్- అట్లీ సినిమా ఓటీటీ డీల్ 600 కోట్లు- వైరల్ గా బజ్- ఆల్ టైమ్ రికార్డు!
ఓ లేటెస్ట్ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. రికార్డుల దుమ్ము దులిపేందుకు రెడీ అయింది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా ఓటీటీ రైట్స్ కు ఆల్ టైమ్ రికార్డు రేట్ పలికిందనేదే కారణం. అది కూడా ఏకంగా రూ.600 కోట్లు.
రికార్డులు నెలకొల్పడం, వాటిని తిరగరాయడం.. ఇదే పనిగా సాగుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా పుష్ఫ 2 ఉంది. ఆ సినిమా ఓటీటీ రేట్లకు ఏకంగా రూ.275 కోట్లు వచ్చాయి. ఇప్పుడా రికార్డును అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మూవీ బ్రేక్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రూ.600 కోట్లు
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఏఏ22 x ఏ6 వర్కింట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఓ క్రేజీ బజ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ డీల్ ఏకంగా రూ.600 కోట్లకు కుదిరినట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రికార్డు రేటు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిపి ఇంత మొత్తం చెల్లించనుందని టాక్.
ఆల్ టైమ్ రికార్డు
ఇప్పటివరకూ అత్యధిక ఓటీటీ రేట్ పలికిన సినిమాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ఉంది. దీని ఓటీటీ రేట్ రూ.275 కోట్లు. ఇప్పుడు ఆ మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న తర్వాతి సినిమానే రికార్డులు బ్రేక్ చేయబోతుంది. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయనుంది. ఇండియాలో ఏ సినిమా ఓటీటీ హక్కుల కోసమైనా రూ.600 కోట్లు అనేది ఇదే ఫస్ట్ టైమ్ కానుంది. అయితే ఈ ఓటీటీ డీల్ పై ఇంకా నెట్‌ఫ్లిక్స్ నుంచి కానీ, మేకర్స్ నుంచి కానీ అఫీషియల్ అప్ డేట్ రాలేదు.
కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్
అల్లు అర్జున్-అట్లీ మూవీ ఓటీటీ డీల్ రూ.600 కోట్లకు కుదిరిందనే బజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఇదీ మా హీరో రేంజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అప్పుడు పుష్ప 2, ఇప్పుడు ఏఏ22 x ఏ6 అని తెగ ఖుష్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్స్ లో ఇదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
రూ.1000 కోట్ల బడ్జెట్
అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ బడ్జెట్ రూ.1000 కోట్లు అని తెలిసింది. ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృనాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఈ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026 పూర్తయ్యే సరికి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


