కొండల్లో కుక్కల అరుపులు-ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్-బ్లాక్ బస్టర్ మూవీ-మిస్ అవకుండా చూడాల్సి సినిమా
ఇవాళ ఓటీటీలోకి ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ వచ్చేసింది. 2025లోనే బెస్ట్ మలయాళీ ఫిల్మ్ గా ప్రశంసలు పొందుతున్న సినిమా ఇది. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీని మిస్ కాకుండా చూడాలనే కామెంట్లు వస్తున్నాయి.
ఓటీటీలో 2025లో వేలాది సినిమాలు వచ్చాయి. ఇందులో ఎన్నో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ను మరింత బ్లాక్ బస్టర్ గా మార్చేందుకు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ ఓటీటీలోకి వచ్చేసింది. 2025లో బెస్ట్ మలయాళ సినిమాగా ఎకోపై ప్రశంసలు కురుస్తున్నాయి. మిస్ కాకుండా చూడాల్సిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి.

ఎకో ఓటీటీ
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎకో. 2025లో ఓటీటీలో చాలా బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఓటీటీ ఆడియన్స్ ను మెప్పించాయి. ఇప్పుడు అలాంటి ఓ సూపర్ హిట్ థ్రిల్లర్ ఎకో ఓటీటీలో అడుగుపెట్టింది. బుధవారం (డిసెంబర్ 31) ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
తెలుగులో అప్పుడే
ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది మిస్టరీ థ్రిల్లర్ ఎకో. కానీ తెలుగు ఆడియన్స్ కు మాత్రం అసలైన ఈ మూవీ ట్రీట్ జనవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఎందుకంటే ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఎకో మూవీ జనవరి 7 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు కేవలం మలయాళ భాషలోనే స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చే వారం నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
బ్లాక్ బస్టర్
ఎకో మూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్లు సాధించిపెట్టింది. ఈ మూవీలో సందీప్ ప్రదీప్, బియానా, వినీత్, నరైన్, సౌరభ్ తదితరులు నటించారు. దీనికి దినజిత్ అయ్యతన్ డైరెక్టర్.
ఎకో స్టోరీ
కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని అడవిలో ఉన్న ఓ ఊరిలో ఎకో కథ సాగుతుంది. కురియాచన్ అనే ఓ వ్యక్తి ఒక పెద్ద ఎస్టేట్ లో కుక్కలను పెంచుతుంటాడు. కానీ అయిదేళ్ల క్రితం అతను కనిపించకుండా పోతాడు. అతను కనిపించకుండా పోవడం మిస్టరీగా మారుతుంది. అతను చాలా మందిని మోసం చేసి పారిపోయాడని అంటారు. అతని కోసం వెతుకుతుంటారు.
మరోవైపు కురియాచన్ భార్య మ్లాతి తన భర్త రాక కోసం ఎస్టేట్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకు హెల్ప్ గా పీయూస్ ఉంటాడు. మరోవైపు కొండల్లో కుక్కల అరుపులు భయంకరంగా ఉంటాయి. కురియాచన్ వల్ల నష్టపోయిన వ్యాపారవేత్త మోహన్ అతని కోసం వెతుకుతుంటాడు.
మరి కురియాచన్ దొరికాడా? అతని కథ ఏంటీ? ఎస్టేట్ లోని రహస్యాలు ఏంటీ? అన్నది ఎకో సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


