ఈ వారం ఓటీటీలోకి తెలుగులో వస్తున్న సినిమాలు- మలయాళం మిస్టరీ థ్రిల్లర్- న్యూ ఇయర్ రోజు మోగ్లీ- ఓ లుక్కేయండి

మరో కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వీక్ ఓటీటీలోకి తెలుగులో వచ్చే మూవీస్, సిరీస్ ఏంటో ఇక్కడ చూద్దాం. 

Published on: Dec 29, 2025, 12:10:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఎప్పటిలాగే ఈ వారం కూడా సినిమాలు, సిరీస్ లు వరుస కడుతున్నాయి. ఇందులో తెలుగులో వచ్చే చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో ఓ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ కూడా ఉంది. మరి ఈ వారం తెలుగు ఆడియన్స్ చూసేందుకు ఓటీటీలో స్పెషల్ గా ఏమున్నాయో ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలోకి తెలుగులో సినిమాలు (x)
ఈ వారం ఓటీటీలోకి తెలుగులో సినిమాలు (x)

ఎకో ఓటీటీ

ఇప్పుడు సినీ లవర్స్ ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఎకో సినిమా గురించే. ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.5 కోట్లతో తీసిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఎకో మూవీ ఓటీటీలోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 31 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది అందుబాటులోకి వస్తుంది.

మోగ్లీ ఓటీటీ

సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన తెలుగు సినిమా మోగ్లీ. ఇది థియేటర్లో రిలీజైన 18 రోజులకే ఓటీటీలోకి వస్తుంది. మోగ్లీ మూవీ డిసెంబర్ 13న థియేటర్లో విడుదలైంది. అఖండ 2తో పోటీని ఎదుర్కొన్న ఈ చిత్రం తొందరగానే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఎల్బీడబ్ల్యూ

తమిళ స్పోర్ట్స్ డ్రామా ఎల్బీడబ్ల్యూ: లవ్ బియాండ్ వికెట్. క్రీడలాడితే క్రమశిక్షణ వస్తుంది, జీవితంపై ఓ క్లారిటీ వస్తుందని చెప్పే సిరీస్ ఈ ఎల్బీడబ్ల్యూ. ఇందులో విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జనవరి 1న ఇది జియోహాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కు ఎండ్ కార్డు పడనుంది. ఈ సీజన్ కు, సిరీస్ కు లాస్ట్ ఎపిసోడ్ జనవరి 1న రిలీజ్ కానుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది ఈ సిరీస్. ఇప్పటి స్ట్రేంజ్ థింగ్స్ సీజన్ 5 ఫస్ట్, సెకండ్ పార్టులు నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ రాబోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More