ఓటీటీలో భరణం కోసం పోరాడే కోర్ట్ రూమ్ డ్రామాపై సమంత రివ్యూ- అన్ని భావాలు అనుభవించాను, పక్షపాతం లేదు, ఎమోషనల్ అయ్యానంటూ!

ఓటీటీలోకి ఇటీవల భరణం కోసం పోరాడే కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం హక్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీలో హక్ సినిమా చూసిన స్టార్ హీరోయిన్ సమంత రివ్యూ ఇవ్వడంతోపాటు ప్రశంసలు కురిపించింది. హక్ మూవీ తనను ఎమోషనల్ అయ్యేలా చేసిందని, యామీ గౌతమ్ నటన మాస్టర్ క్లాస్ అని సమంత కొనియాడింది.

Published on: Jan 13, 2026 4:13 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘హక్’ (Haq) చిత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకే ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కూడా హక్ మూవీపై రివ్యూ ఇవ్వడమే కాకుండా ప్రశంసలు కురిపించింది.

ఓటీటీలో భరణం కోసం పోరాడే కోర్ట్ రూమ్ డ్రామాపై సమంత రివ్యూ- అన్ని భావాలు అనుభవించాను, పక్షపాతం లేదు, ఎమోషనల్ అయ్యానంటూ!
ఓటీటీలో భరణం కోసం పోరాడే కోర్ట్ రూమ్ డ్రామాపై సమంత రివ్యూ- అన్ని భావాలు అనుభవించాను, పక్షపాతం లేదు, ఎమోషనల్ అయ్యానంటూ!

ఓటీటీలో హక్ స్ట్రీమింగ్

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న హక్ మూవీపై సమంత స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం తనను ఎంతగానో కదిలించిందని, చూస్తున్నంత సేపు అనేక భావోద్వేగాలకు లోనయ్యానని సామ్ పేర్కొంది.

ఒకేసారి కోపం, ప్రేమ, ఆశ.. అన్ని రకాల ఎమోషన్స్ కలబోతగా ఉందంటూ మంగళవారం (జనవరి 13) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీతో సమంత ‘హక్’ చిత్ర బృందాన్ని అభినందించారు.

ఇలాంటి కథలు అరుదు

"హక్ సినిమా అయిపోయిన వెంటనే ఈ మాటలు రాయాలనిపించింది. ఎందుకంటే ఆ సినిమా నాలో కలిగించిన భావోద్వేగాలను కొంచెం కూడా కోల్పోకూడదని అనుకున్నాను. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి" అని సమంత తన నోట్‌లో పేర్కొంది.

"ఈ కథ ఎంతో సహజంగా, లోతైన మానవీయ కోణంలో సాగింది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎక్కడా ఎవరినీ తక్కువ చేసి చూపించలేదు. ముఖ్యంగా యమీ గౌతమ్ లాంటి అద్భుతమైన నటి ఈ కథకు ప్రాణం పోశారు. యామీ.. నీ నటన నన్ను మాటల్లో చెప్పలేనంతగా కదిలించింది" అని సామ్ రాసుకొచ్చింది.

ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామో

"ఒకేసారి ప్రేమ, ఆగ్రహం, బలం, నిస్సహాయత, ఆశ.. ఇలా అన్ని భావాలను నేను అనుభవించాను. సినిమా అంటే ఇది. ఎన్నో ఆటుపోటుల మధ్య మనం ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నామో, ఎందుకు కష్టపడతామో చెప్పడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం" అంటూ హక్ మూవీ దర్శకుడు సుపర్ణ్ వర్మను కూడా సమంత రూత్ ప్రభు అభినందించింది.

ఇంత మంచి స్టోరీని ఎంతో అందంగా చూపించిన డైరెక్టర్ సుపర్ణ్ వర్మకు అతిపెద్ద అభినందలు అంటూ సమంత తన ఆనందాన్ని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇలా కేవలం సమంత మాత్రమే కాదు, అంతకుముందే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, స్టార్ నటి అలియా భట్ కూడా ఈ సినిమాను కొనియాడారు.

నటన నేర్చుకునేవారికి పాఠం

"చాలా ఏళ్ల తర్వాత ఒక నటన నన్ను ఇంతలా కదిలించింది. యమీ గౌతమ్ నటనను వర్ణించడానికి పదాలు సరిపోవు. ఆమె మౌనం, చూపులు, క్లైమాక్స్ మోనోలాగ్.. నటన నేర్చుకునే వారికి ఇదొక పాఠం. ఆమెకు సెల్యూట్ చేస్తున్నాను" అని కరణ్ జోహార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

హక్ కథ

బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ కోర్ట్‌ రూమ్ డ్రామా మూవీ హక్ భారత న్యాయ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘షా బానో’ కేసు ఆధారంగా రూపొందింది. భర్త రెండో పెళ్లి చేసుకుని, తనను, తన పిల్లలను రోడ్డున పడేసినప్పుడు ఒక మహిళ చట్టం ద్వారా తన హక్కులను ఎలా సాధించుకుందనేదే ఈ సినిమా ఇతివృత్తం.

భర్త నుంచి భరణం పొందడానికి భార్య చేసే పోరాటం చుట్టూ సాగే హక్ మూవీ థియేటర్లలో గతేడాది నవంబర్ 7న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 29 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించినప్పటికీ విమర్శల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా.

హక్ మూవీపై సమంత రివ్యూ (Samantha Instagram)
హక్ మూవీపై సమంత రివ్యూ (Samantha Instagram)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఇక జనవరి 2న నెట్‌ఫ్లిక్స్‌లో హక్ ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతోంది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీలతో పాటు శీబా చద్దా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.