పర్ఫెక్ట్ కోడలిగా సమంత- మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ రిలీజ్- చీరలో సామ్ అదిరిపోయే యాక్షన్, వయోలెన్స్ కూడా!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ సినిమా ‘మా ఇంటి బంగారం’. తాజాగా ఇవాల మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పర్‌ఫెక్ట్ సంప్రదాయ కోడలిగా కనిపిస్తూనే, శత్రువుల వేటలో కాళిలా సమంత చూపించిన యాక్షన్ విశ్వరూపం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Published on: Jan 9, 2026, 13:29:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణాది వెండితెరపై తనకంటూ ఓ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్న బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మళ్లీ మెరవడానికి సిద్దమైంది సమంత. హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీనే ‘మా ఇంటి బంగారం’.

పర్ఫెక్ట్ కోడలిగా సమంత- మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ రిలీజ్- చీరలో సామ్ అదిరిపోయే యాక్షన్, వయోలెన్స్ కూడా!
పర్ఫెక్ట్ కోడలిగా సమంత- మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ రిలీజ్- చీరలో సామ్ అదిరిపోయే యాక్షన్, వయోలెన్స్ కూడా!

తాజాగా ఇవాళ (జనవరి 9, శుక్రవారం) సమంత మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ టీజర్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇందులో సమంత లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ఆమె తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పక్కా ఫ్యామిలీ ప్యాకేజీ.. కానీ పవర్ ఫుల్!

మా ఇంటి బంగారం టీజర్ ప్రారంభంలో సమంత తన భర్తతో కలిసి అత్తవారింట్లో అడుగుపెడుతుంది. అంతా బాగున్నారని సమంత అంటే అసలైన ఎంక్వైరీ మొదలవుతుందని భర్త అంటాడు. "వారంలో అందరినీ నా దారిలోకి తెచ్చుకుంటాను" అని భర్తకు సమంత చెబుతుంది.

ఆ సీన్ కట్ చేస్తే సమంతలోని యాక్షన్ కోణం బయటపడుతుంది. ఓ పక్క వంటగదిలో పని చేస్తూనే.. మరో పక్క తుపాకులతో శత్రువుల వేట సాగిస్తుంది. చీరలో బస్‌లో రౌడీలను, రాత్రి పూట ఇంటికి వచ్చిన రౌడీలను చితకొట్టే సీన్ అదిరిపోయింది. చీరలో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.

రౌడీలను ఊచకోత కోయడం, రక్తంతో తడిసిన నేలను క్లీన్ చేయడం వంటి సీన్లు బాగున్నాయి. ఈ సినిమాలో సమంత పర్‌ఫెక్ట్ సాంప్రదాయమైన కోడలిగా ఉంటూనే రౌడీలకు యాక్షన్‌తో వయోలెన్స్ చూపిస్తుందని తెలుస్తోంది. పగలు పద్ధతిగల కోడలిగా ఇంట్లో అందరితో ఉంటూ రాత్రిపూట రౌడీలను రఫ్పాడించే సీన్స్ బాగున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్

ఈ టీజర్ గురించి సమంత స్పందిస్తూ "ఈ బంగారం.. భలే మొండిది (This gold is bloody bold)" అంటూ తన పాత్ర స్వభావాన్ని ఒక్క ముక్కలో చెప్పేసింది. మా ఇంటి బంగారం టీజర్‌పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రియాక్ట్ అయింది. "అద్భుతం.. ఫ్యాబ్ ఫ్యాబ్ ఫ్యాబ్" అంటూ కితాబు ఇచ్చింది.

"థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లడం ఖాయం", "సమంత ఈజ్ బ్యాక్" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన ఈజ్ (Ease) హాలీవుడ్ రేంజ్‌లో ఉందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సమంత రీ ఎంట్రీ అదిరిపోయిందని అంతా భావిస్తున్నారు.

‘ఓ బేబీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ బేబీ’ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి-సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై రాజ్‌ నిడిమోరు, హిమాంక్ దువ్వురుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మా ఇంటి బంగారం సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి, మంజూష, యాంకర్ శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ, కుటుంబం, స్త్రీ శక్తి చుట్టూ తిరిగే కథగా మా ఇంటి బంగారం తెరకెక్కినట్లు తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More