28 ఏళ్ల అమ్మాయితో 52 ఏళ్ల వ్యక్తి లవ్-ఓటీటీలోకి వచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ-100 కోట్ల సినిమా
28 ఏళ్ల అమ్మాయి, 52 ఏళ్ల అబ్బాయి మధ్య లవ్ స్టోరీని రొమాంటిక్ కామెడీగా చూపించిన సినిమా దే దే ప్యార్ దే 2. రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'దే దే ప్యార్ దే 2' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 28 ఏళ్ల అమ్మాయి, 52 ఏళ్ల పురుషుడి మధ్య లవ్ చూట్టూ సాగుతుంది.

దే దే ప్యార్ దే 2 ఓటీటీ
శుక్రవారం చాలా సినిమాలే ఓటీటీలోకి వచ్చాయి. అందులో ఒకటి దే దే ప్యార్ దే 2. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది ఈ మూవీ. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. చలికాలంలో హాయిగా నవ్వుకోవడానికి ఇది సరైన సినిమా.
సీక్వెల్
2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ ఈ దే దే ప్యార్ దే 2. ఇందులో అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్.. ఆశిష్ మెహ్రా, అయేషా ఖురానాగా తమ పాత్రల్లోనే తిరిగి నటించారు. 'దే దే ప్యార్ దే 2' లో అయేషా తండ్రిగా ఆర్. మాధవన్, తల్లిగా గౌతమి కపూర్ పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జావేద్ జాఫెరి, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, తరుణ్ గెహ్లోట్, సంజీవ్ సేథ్, సుహాసిని ములే, గ్రేసీ గోస్వామి, జ్యోతి గౌబా కూడా నటించారు.
పాజిటివ్ టాక్
నవంబర్ 14, 2025న థియేటర్లలో రిలీజైన దే దే ప్యార్ దే 2 మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ లుష్‌ఫిల్మ్స్, టి-సిరీస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ బక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఓటీటీలో డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.
దే దే ప్యార్ దే 2 కథ
లండన్ లో ఉండే 52 ఏళ్ల ఎన్నారై పెట్టుబడిదారుడు ఆశిష్ మెహ్రా. అతని కంటే చాలా చిన్నదైన 28 ఏళ్ల అయేషా ఖురానాను ప్రేమిస్తాడు. అయేషా కుటుంబం వారి ప్రేమకథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
'ఆశిష్ అయేషా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ తన కఠినమైన పరీక్షను ఎదుర్కొంటుంది. వయసు వ్యత్యాసం ఉన్న ప్రేమకథ హృదయాలను గెలుచుకుంటుందా లేక గందరగోళాన్ని సృష్టిస్తుందా? ఈ ప్యార్ వర్సెస్ పరివార్ క్లాష్ అన్ని రకాల ప్రేక్షకులకు ఆసక్తికరమైన, హాస్యభరితమైన ప్రయాణాన్ని అందిస్తుందని హామీ ఇస్తుంది' అని దే దే ప్యార్ దే 2 మూవీ గురించి ఐఎండీబీ పేర్కొంది.














