ఓటీటీ టాప్ 5 సినిమాల్లో రవితేజ డిజాస్టర్.. కొనసాగుతున్న రష్మిక హారర్ కామెడీ మూవీ హవా
ఓటీటీలో తాజాగా టాప్ 5 సినిమాల జాబితా వచ్చేసింది. డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల లిస్టును ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో రవితేజ డిజాస్టర్ మూవీ కూడా ఉండటం విశేషం.
ఓటీటీలో ప్రతివారం ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలుసు కదా. గతవారం అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్య కూడా ఏ సినిమాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయో తేలిపోయింది. అయితే టాప్ 5 జాబితాలో రవితేజ డిజాస్టర్ మాస్ జాతర కూడా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

టాప్ 5లో మాస్ జాతర
ఓటీటీ టాప్ 5 సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ మూవీ థామా తొలి స్థానంలో కొనసాగుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గతవారం 2.3 మిలియన్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. రెండో స్థానంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఏక్ దీవానే కీ దీవానియత్ నిలిచింది. ఈ మూవీకి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన హక్ మూవీ ఉంది. ఈ మూవీకి 2 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లోనే ఉన్న రాత్ అకేలీ హై సినిమా 1.6 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మాస్ జాతర సినిమాకు 1.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సినిమా ఐదో స్థానంలో ఉంది.
టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే..
ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. టాప్ 5లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతున్నవి ఉన్నాయి. తొలి స్థానంలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఉంది. దీనికి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న మిసెస్ దేశ్‌పాండే నిలవగా.. దీనికి 2.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.
ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ నాలుగో సీజన్ కు గత వారం 1.4 మిలియన్ వ్యూస్ రాగా.. మూడో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లోని సింగిల్ పాపాకు 1.3 వ్యూస్, జియోహాట్‌స్టార్ లోని ఎల్బీడబ్ల్యూ: లవ్ బియాండ్ వికెట్ 1.2 మిలియన్ వ్యూస్ తో 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


