లిస్బన్ అందాల్లో సమంత- పోర్చుగల్‌లో హనీమూన్- దానిపై ఆశగా భర్త రాజ్ నిడిమోరు- కొత్త ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు తమ వివాహం తర్వాత పోర్చుగల్‌లో హనీమూన్‌లో భాగంగా విహరిస్తున్నారు. లిస్బన్ నగరంలోని అందాలను ఆస్వాదిస్తూ సమంత షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

Dec 30, 2025, 21:08:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఈ నెల మొదట్లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఓ ఇంటివారైన ఈ అమ్మడు, ప్రస్తుతం తన భర్తతో కలిసి పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో సందడి చేస్తున్నారు. తమ ‘హనీమూన్’ ట్రిప్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను సమంత మంగళవారం (డిసెంబర్ 30) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

లిస్బన్ అందాల్లో సమంత- పోర్చుగల్‌లో హనీమూన్- దానిపై ఆశగా భర్త రాజ్ నిడిమోరు- కొత్త ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్
లిస్బన్ అందాల్లో సమంత- పోర్చుగల్‌లో హనీమూన్- దానిపై ఆశగా భర్త రాజ్ నిడిమోరు- కొత్త ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్

లిస్బన్ వీధుల్లో కొత్త జంట ముచ్చట్లు

లిస్బన్‌లోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను ఈ జంట ఎంతో ఉత్సాహంగా అన్వేషిస్తున్నారు. ఫాతిమాలోని 'బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ', ప్రసిద్ధ 'మాన్యుమెంట్ టు ది డిస్కవరీస్', 'ఆర్కో డా రువా అగస్టా' వంటి ప్రాంతాలను సమంత, రాజ్ నిడిమోరు సందర్శించారు.

ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు నోరూరించే చాక్లెట్ డోనట్‌ను ఆశగా చూస్తుండగా, మరో ఫోటోలో సమంత అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ కనిపించారు. ముఖ్యంగా పింక్ కలర్ బీనీ క్యాప్ ధరించిన సమంత లుక్ నెటిజన్లను కట్టిపడేస్తోంది.

"డిసెంబర్ ప్రయాణం ఇలా.."

ఈ వెకేషన్ కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "డిసెంబర్ ఇలా గడిచిపోతోంది" అని హీరోయిన్ సమంత క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సమంత ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి మురిసిపోతున్నారు.

"చివరికి తను కోరుకున్న ప్రశాంతత దొరికింది", "చాలా క్యూట్‌గా ఉన్నారు" అంటూ కామెంట్లతో సమంతపై ఉన్న తమ ప్రేమను చాటుతున్నారు. అనుపమ పరమేశ్వరన్, నిమ్రత్ కౌర్ వంటి సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రహస్యంగా జరిగిన వేడుక

కాగా, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య సమంత, రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాలా రహస్యంగా ఈ వేడుకను నిర్వహించారు. వివాహం ముగిసిన తర్వాతే సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా రెండో పెళ్లి విషయాన్ని ధృవీకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వృత్తిపరంగా కూడా జోడీనే!

సమంత, రాజ్ నిడిమోరు కేవలం నిజ జీవితంలోనే కాదు, వెండితెర వెనుక కూడా విజయవంతమైన భాగస్వాములుగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి భారీ ప్రాజెక్టులకు పనిచేశారు.

ప్రస్తుతం సమంత రాజ్ నిడిమోరు 'రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్‌డమ్' అనే మరో ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్‌లో భాగమయ్యారు. వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ సమంత ఈ ఏడాదిని ఒక మరుపురాని జ్ఞాపకంగా ముగించబోతున్నారని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More