మొన్న నిధి అగర్వాల్, ఇవాళ సమంత- పైకి దూసుకొచ్చిన జనం, చుట్టుముట్టిన వందలాది మంది- అయినా చిరునవ్వుతో మెరిసిన హీరోయిన్!
హైదరాబాద్‌లో ఒక ఈవెంట్‌కు హాజరైన స్టార్ హీరోయిన్ సమంతకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సౌత్ ఇండియాలో సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు హైదరాబాద్‌లో అభిమానుల నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం (డిసెంబర్ 21) నగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సమంతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే, ఒక్కసారిగా అభిమానులు ఆమెపైకి దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

అదుపు తప్పిన జనం.. ఉక్కిరిబిక్కిరైన సమంత
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పట్టుచీరలో ఎంతో హుందాగా ఈవెంట్‌కు వచ్చిన సమంత కార్యక్రమం ముగించుకుని స్టేజ్ పైనుంచి కారు వైపు వెళ్తుండగా వందలాది మంది ఆమెను చుట్టుముట్టారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారింది.
జనాల తోపులాట మధ్య సమంత కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, సమంత చిరునవ్వు చెదరకుండా నిబ్బరంగా కారు వరకు చేరుకోగలిగారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మళ్లీ అదే సీన్.. మారని తీరు
కొద్దిరోజుల క్రితమే 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జనం ఆమెను ఇబ్బంది పెట్టిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. "నిధి అగర్వాల్ ఇన్సిడెంట్ తర్వాత కూడా అభిమానులకు బుద్ధి రాదా? సెలబ్రిటీలకు ప్రైవసీ ఉండదా?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
వెర్రి అభిమానంపై విమర్శలు
దక్షిణాదిలో సినీ తారల పట్ల ఉండే అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "అభిమానం ఉండాలి కానీ, అది అవతలి వారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. మేనేజ్‌మెంట్ ఇలాంటి పరిస్థితులకు ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయదు?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గతంలో అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్ల కార్యక్రమాల్లోనూ ఇలాంటి తోపులాటలు జరిగాయని, ఈ సంస్కృతి మారాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా మొన్న నిధి అగర్వాల్‌కు, ఇవాళ సమంతకు అభిమానులు నడవడానికి కూడా ఇబ్బంది పడేలా చుక్కలు చూపించారు.
సమంత సినిమాలు
సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్‌డమ్' (Rakt Brahmand: The Bloody Kingdom) అనే భారీ ఓటీటీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


