నిధి అగర్వాల్ ఘటనపై లులు మాల్‌పై పోలీసు కేసు నమోదు.. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంతో..
ది రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ను అభిమానులు చుట్టుముట్టి ఇబ్బందికి గురి చేసిన ఘటనలో ఆర్గనైజర్లు, లులు మాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని లులు మాల్‌లో జరిగిన ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలుసు కదా. సెల్ఫీల కోసం జనం ఆమెను చుట్టుముట్టి, తోసేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించినందుకు మాల్ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసు కేసు
బుధవారం (డిసెంబర్ 17) సాయంత్రం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' నుంచి 'సహానా సహానా' సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమెను జనం తోసేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.
ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు స్పందించారు. గురువారం (డిసెంబర్ 18)నాడు లులు మాల్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ ఆర్గనైజర్స్‌పై కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద ఈవెంట్‌ను, అదీ ఒక సెలబ్రిటీని పిలిచి నిర్వహిస్తున్నప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది?
మామూలుగానే తెలుగు సినిమా ఈవెంట్స్ అంటే ఆలస్యం అవుతుంటాయి. సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ఈవెంట్ లేట్‌గా మొదలైంది. అప్పటికే మాల్‌లో జనం కిక్కిరిసిపోయారు. నిధి అగర్వాల్ కనిపించగానే జనం ఎగబడ్డారు. సెల్ఫీల కోసం ఆమెను చుట్టుముట్టారు. కొందరు ఆమెను తాకడానికి ప్రయత్నించారు.
వైరల్ అవుతున్న వీడియోల్లో నిధి చాలా ఇబ్బందిగా, భయంగా కనిపించింది. ఆమె సెక్యూరిటీ, టీమ్ మెంబర్స్ అతి కష్టం మీద జనాన్ని పక్కకు నెట్టుకుంటూ ఆమెను కారు దగ్గరకు చేర్చారు.
ఈ ఈవెంట్‌లో ప్రభాస్, మరో హీరోయిన్ రిద్ధి కుమార్, డైరెక్టర్ మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా పాల్గొన్నారు. ఈ ఘటనపై నిధి అగర్వాల్ ఇంకా స్పందించలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


