నిధి అగర్వాల్ కు షాకింగ్ అనుభవం.. మీదకు ఎగబడిపోయిన ఫ్యాన్స్.. అతి కష్టం మీద కార్లోకి ఎక్కి ఓ మై గాడ్ అనుకున్న హీరోయిన్
ప్రభాస్ సినిమా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ మూవీలోని సహన సహన సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు వెళ్లిన ఆమెపైకి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఎంతో కష్టం మీద ఆమె కార్లోకి ఎక్కగలిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటుతుంది. ఇలాంటివి చూసే వీళ్లేం ఫ్యాన్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల మీదకు ఎగబడే విషయంలో అభిమానుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెను చుట్టుముట్టిన అభిమానులు తోసేసుకుంటూ హీరోయిన్ పైకి ఎగబడిపోయారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

రాజాసాబ్ సాంగ్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్. ఇందులోని ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ మూవీలోని సహన సహన అంటూ సాగే సాంగ్ ను బుధవారం (డిసెంబర్ 17) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని లూలూ మాల్ లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ అటెండ్ అయ్యారు.
నిధి అగర్వాల్ పైకి
రాజాసాబ్ సాంగ్ సహన సహన సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు భారీగా అభిమానులు వచ్చారు. ఈ ఈవెంట్ జరుగుతున్నంత సేపూ దగ్గరగా గుమి గూడి తోసుకుంటూనే ఉన్నారు. ఇక ఈవెంట్ అయిపోయి నిధి అగర్వాల్ వెళ్లిపోయే సమయంలో ఒక్కసారిగా ఆమెపైకి ఎగబడ్డారు. ఆమెపైకి తోసుకుంటూ వచ్చారు. హీరోయిన్ పై చేతులు వేశారు. అతి కష్టం మీద సెక్యూరిటీ సాయంతో నిధి కార్లోకి ఎక్కింది. కార్లోకి వెళ్లాక ఒక్కసారిగా ఓ మై గాడ్ అనుకుంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
కామన్ సెన్స్ లేకుండా
నిధి అగర్వాల్ పట్ల ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కాస్త కామన్ సెన్స్ ఉన్నా పరిస్థితి ఇలా మారేది కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బిహేవియర్ ను యాక్సెప్ట్ చేయొద్దని అంటున్నారు. ఇది హీరోయిన్ ను ఫిజికల్ గా వేధించడమే అని పోస్ట్ లు పెడుతున్నారు.
రాజాసాబ్ రిలీజ్
ప్రభాస్ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 9న థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ లో ప్రభాస్ వింటేజీ లుక్ లో కనిపిస్తున్నాడు. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక హీరోయిన్లు.
ఇప్పటికే రాజాసాబ్ ట్రైలర్, రెబల్ సాబ్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు వచ్చిన మెలోడీ సహన కూడా ఆకట్టుకుంటోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


