నారీ నారీ నడుమ మురారి రివ్యూ- లవర్‌తో పెళ్లి, మాజీ ప్రేయసి వచ్చి అడ్డు పడితే- కామెడీతో శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ మూవీ నారీ నారీ నడుమ మురారి. సంయక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 14న సాయంత్రం థియేటర్లలో విడుదల అయింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో నేటి నారీ నారీ నడుమ మురారి రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jan 15, 2026, 06:10:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: నారీ నారీ నడుమ మురారి

నారీ నారీ నడుమ మురారి రివ్యూ- లవర్‌తో పెళ్లి, మాజీ ప్రేయసి వచ్చి అడ్డు పడితే- కామెడీతో శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా?
నారీ నారీ నడుమ మురారి రివ్యూ- లవర్‌తో పెళ్లి, మాజీ ప్రేయసి వచ్చి అడ్డు పడితే- కామెడీతో శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా?

నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్ తదితరులు

దర్శకత్వం: రామ్ అబ్బరాజు

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్

నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర

విడుదల తేది: జనవరి 14, 2026

వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హిట్ కొట్టాలనే తపనతో వచ్చిన సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటించారు.

2026 సంక్రాంతికి వచ్చిన ఐదో సినిమా నారీ నారీ నడుమ మురారి జనవర 14న సాయంత్రం షోతో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శర్వానంద్ కమ్‌బ్యాక్ ఇచ్చాడా? లేదా? అనేది నేటి నారీ నారీ నడుమ మురారి రివ్యూలో తెలుసుకుందాం.

విశ్లేషణ:

బీటెక్ తర్వాత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తాడు గౌతమ్ (శర్వానంద్). తను పని చేసే కంపెనీలో సివిల్ ఇంజనీర్ నిత్య (సాక్షి వైద్య)ను ప్రేమిస్తాడు గౌతమ్. ఇద్దరు ప్రేమించుకుని ఇంట్లోవాళ్లను ఒప్పిస్తారు. అతి కష్టం మీద ఓ కండిషన్‌తో నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) ఒప్పుకుంటాడు.

ప్రేమించిన అమ్మాయితో గౌతమ్ పెళ్లి జరుగుతుండగా.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ దియా (సంయుక్త మీనన్) వచ్చి అడ్డుపడుతుంది. అలా గౌతమ్ పెళ్లికి అన్ని అడ్డంకులు ఏర్పడతాయి.

ఆ తర్వాత ఏమైంది? అసలు గౌతమ్ పెళ్లికి దియా ఎందుకు అడ్డు పడింది?, గౌతమ్ తండ్రి కార్తీక్ (వీకే నరేష్) లేటు వయసులో పల్లవి (సిరి హనుమంత్)ని పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటీ? గౌతమ్ దియాకు ఎందుకు బ్రేకప్ అయింది? రామలింగం పెట్టిన కండిషన్ ఏంటీ? చివరికి నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

నారీ నారీ నడుమ మురారి సినిమా ట్రైలర్, టీజర్ చూస్తే కథ ఏంటో అర్థమైపోతుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో నలిగిపోయే స్టోరీ అని సింపుల్‌గా చెప్పేయొచ్చు. కానీ, సినిమా చూసిన ప్రేక్షకుడుకి మాత్రం అంతకుమించిన ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. సింపుల్ స్టోరీని కూడా కాన్‌ఫ్లిక్ట్స్‌తో కామెడీగా ఎంత బాగా చెప్పొచ్చో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో నిత్య, గౌతమ్ లవ్ ట్రాక్, ఇంట్లోవాళ్లను ఒప్పించడం, ప్రేయసి తండ్రిని ఒప్పించేందుకు హీరో పడే కష్టాలతో చాలా సరదాగా హాయిగా నవ్విస్తూ సాగుతుంది సినిమా. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.

ఆ తర్వాత సెకండాఫ్ అంతా కూడా డిఫరెంట్ సీన్లతో అలిరిస్తూనే ఉంటుంది. స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. కానీ, చివరికి ఎలా ముగించారు, ఎలా నరేట్ చేశారనేదే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయం. అందులో డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

శర్వానంద్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్

అక్కడక్కడ వచ్చే ట్విస్టులు, కామెడీ ట్రాక్ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. ఇంతకుమించి ఏం చెప్పుకున్న స్పాయిలర్ అవుతుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. పాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. ఎక్కడ కూడా అనవసరపు సీన్ లేదు. విజువల్స్ చాలా బాగున్నాయి.

నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇలాంటి రైటింగ్ ఇటీవల్టీ తెలుగు సినిమాల్లో చాలా వరకు మిస్ అయిందనే చెప్పుకోచ్చు. రైటింగ్, డైరెక్టర్ టేకింగ్ అదిరిపోయింది. ఇక శర్వానంద్ తన ఛార్మ్‌తో ఫుల్‌గా అట్రాక్ట్ చేశాడు. సినిమా మొత్తం హైలెట్ అవుతాడు. రన్ రాజా రన్ రేంజ్‌లో కామెడీ పండించాడు.

వరుసగా ఫ్లాప్స్ చూసిన శర్వానంద్‌కు ఇది గట్టి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్ సాక్షి వైద్య, సంయుక్త మీనన్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారు. వీకే నరేష్ యాక్టింగ్, పాత్ర హైలెట్ అవుతుంది. సినిమా మొత్తం తన పాత్రతో కామెడీ పండించారు. నరేష్‌కు భార్యగా చేసిన సిరి హన్మంత్ సైతం చక్కగా చేశారు.

పక్కా సంక్రాంతి విన్నర్

వెన్నెల కిశోర్, సత్య, సునీల్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సంపత్ రాజ్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే పక్కా పర్‌ఫెక్ట్ సంక్రాంతికి విన్నర్ మూవీ నారీ నారీ నడుమ మురారి అని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగకు లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా హిట్ కొట్టేటువంటి సినిమా నారీ నారీ నడుమ మురారి.

రేటింగ్: 3.5/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More