ఇయర్-ఎండర్ 2025: ఇతర ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్- జూనియర్ ఎన్టీఆర్ నుంచి సారా అర్జున్ వరకు!

2025లో భారతీయ సినీ రంగంలో పెను మార్పులు వచ్చాయి. బాలీవుడ్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలు, హీరోయిన్స్ భాషా సరిహద్దులను దాటి కలిసి నటించారు. అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ హీరోల నుంచి సారా అర్జున్ వంటి హీరోయిన్ వరకు ఇతర ఇండస్ట్రీలో నటించి పాన్-ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.

Dec 30, 2025, 18:13:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు మన సినిమాలు వేరు, వాళ్ల సినిమాలు వేరు అనే భావన ఉండేది. కానీ, 2025 నాటికి ఆ గీతలు పూర్తిగా చెరిగిపోయాయి. ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా పోయింది.

ఇయర్-ఎండర్ 2025: ఇతర ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్- జూనియర్ ఎన్టీఆర్ నుంచి సారా అర్జున్ వరకు!
ఇయర్-ఎండర్ 2025: ఇతర ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్- జూనియర్ ఎన్టీఆర్ నుంచి సారా అర్జున్ వరకు!

ఉత్తరాది స్టార్లు దక్షిణాది సినిమాల్లో మెరుస్తుంటే.. మన సౌత్ సూపర్ స్టార్లు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ‘పాన్ ఇండియా’ అనేది కేవలం ఒక పదంలా కాకుండా, ఇప్పుడు నిజమైన వాస్తవంగా మారిపోయింది. అలా ఇయర్-ఎండర్ 2025లో భాగంగా ఈ ఏడాది ఇతర ఇండస్ట్రీలో నటించి ఎంట్రీ ఇచ్చిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో లుక్కేద్దాం.

రజనీకాంత్‌తో అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సాధారణంగా గెస్ట్ రోల్స్ చేయరు. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపించారు.

ఆగస్టు 14, 2025న విడుదలైన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ ‘దాహా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో మెరిశారు. క్లైమాక్స్‌లో రజనీ-అమీర్ మధ్య వచ్చే సీన్లు అభిమానులకు చాలా నచ్చాయి. వీరిద్దరూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై కలిసి కనిపించడం విశేషం.

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ

‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించిన 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన వార్ 2 సినిమాలో తారక్ ఎనర్జీ, హృతిక్ స్టైల్ కలిసి ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

హిందీలోకి మురుగదాస్-థగ్ లైఫ్‌లో అలీ ఫజల్

సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్‌తో 'సికందర్' సినిమా చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అటు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో దశాబ్దాల తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్'మూవీలో బాలీవుడ్ పాపులర్ నటుడు అలీ ఫజల్ నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం అలీ ఏకంగా తమిళం నేర్చుకోవడం విశేషం.

కొత్త కొత్త కాంబినేషన్లు

సారా అర్జున్: 'దైవతిరుమగళ్' (నాన్న)లో చిన్నారిగా మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి 'ధురంధర్' అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

సోనాక్షి సిన్హా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన హారర్ థ్రిల్లర్ 'జటాధర' సినిమాతో సోనాక్షి సిన్హా తెలుగులోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె 'ధన పిశాచిని' అనే విలక్షణమైన పాత్రలో కనిపించి మెప్పించారు.

గుల్షన్ దేవయ్య: 'కాంతార: చాప్టర్ 1'లో విలన్ కులశేఖరుడిగా నటించి కన్నడ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.

సినిమా రంగానికి భాషా పరమైన అడ్డంకులు లేవని, ప్రతిభ ఉంటే ఏ పరిశ్రమలోనైనా రాణించవచ్చని 2025 నిరూపించింది. ఈ క్రాస్-ఇండస్ట్రీ కొల్లాబరేషన్స్ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More