నారీ నారీ నడుమ మురారి ట్విటర్ రివ్యూ- సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్- శర్వా ఈజ్ బ్యాక్-అదరగొట్టిన నరేష్
సంక్రాంతి 2026 సినిమాల రేసులో చివరగా రిలీజైన మూవీ నారీ నారీ నడుమ మురారీ. ఈ చిత్రం ఇవాళ సాయంత్ర 5.49 గంటలకు రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీపై నెటిజన్లు పాజిటివ్ పోస్టులు పెడుతున్నారు. ట్విటర్ రివ్యూపై ఓ లుక్కేయండి.
సంక్రాంతి పండగ ఆనందాన్ని డబుల్ చేస్తూ ‘నారీ నారీ నడుమ మురారీ’ మూవీ ఇవాళ సాయంత్రం రిలీజైంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా సాయంత్రం 5.49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మరి ట్విటర్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం.

నారీ నారీ నడుమ మురారీ ట్విటర్ రివ్యూ
కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం శర్వానంద్ ప్రయత్నిస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే సినిమాలు అతనికి బాగానే సెట్ అవుతాయి. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ తో హిట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా ఉపయోగించాడు. నారీ నారీ నడుమ మురారీతో మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు.
మూవీ స్టోరీ
గౌతమ్ (శర్వానంద్) ఆర్కిటెక్ట్ గా పని చేస్తుంటాడు. తనతో పాటు జాబ్ చేసే నిత్య (సాక్షి వైద్య)ను ప్రేమిస్తాడు. అప్పుడే గౌతమ్ ఎక్స్ లవర్ దియ (సంయుక్త మీనన్) టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో గౌతమ్ నలిగిపోతాడు. మరోవైపు గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేష్) తనకంటే సగం వయసున్న అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. నెల తిరిగేలోపే గర్భవతిని కూడా చేస్తాడు. మరి కార్తీక్ అలా ఎందుకు చేశాడు? ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న గౌతమ్ ఎలా బయటపడ్డాడు? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ప్యూర్ పొంగల్ ఎంటర్ టైనర్
నారీ నారీ నడుమ మురారీ సినిమాపై ఎక్స్ (ట్విటర్)లో పాజిటివ్ పోస్టులు వస్తున్నాయి. ‘‘సత్య ఎంట్రీతో స్టార్ట్ అయ్యే కామెడీ సూపర్. నరేష్ వన్ మ్యాన్ షోలో నాన్ స్టాప్ నవ్వులు. ఎమోషన్ టచ్ తో ప్రీ క్లైమాక్స్ పర్ఫెక్ట్. ప్యూర్ పొంగల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్’’ అని ఓ యూజర్ పోస్టు చేశాడు.
నవ్వులే నవ్వులు
‘‘సంపత్, వెన్నెల్ కిశోర్ ఎపిసోడ్ కు పడిపడి నవ్వుతారు. శర్వా కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది’’ అని ఓ యూజర్ పోస్టు చేశాడు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. హాలీడేస్ అని ఫ్యామిలీతో వెళ్లా. ఫుల్ ఎంజాయ్ చేశాం. బాగా నవ్వుకున్నాం. ఫస్ట్ హాప్ సత్య ఎంట్రీ, కేరళ ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్.. సెకండాఫ్ లో శ్రీ విష్ణు అన్న క్యామియో అదిరింది’’ అని మరొకరు రాసుకొచ్చారు.
సూపర్ హిట్
‘‘శర్వాకు క్లీన్ సూపర్ హిట్ పడింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. థియేటర్లో చూడాల్సిన మూవీ’’ అని ఒక నెటిజన్ రివ్యూ పంచుకున్నాడు. ‘‘పార్టీ సీన్ ప్లస్ కోర్ట్ సీన్ కలిపి పీక్స్ ఎంటర్ టైన్మెంట్. నరేష్ వన్ మ్యాన్ షో అంటే ఇదే. నాన్ స్టాప్ విజిల్స్, నవ్వులు’’ అని మరొకరు రాసుకొచ్చారు.
నవ్వుల పండగ
‘‘ఈ పోస్టర్ అంతా చెప్పేస్తుంది. నారీ నారీ నడుమ మురారి ఒక లోతైన మెసేజ్ ఉన్న కంప్లీట్ నవ్వుల పండగ. ఒత్తిడి తట్టుకుని డైరెక్టర్ రామ్ అబ్బరాజు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. శర్వానంద్ అద్భుతమైన యాక్టింగ్ తో హ్యాట్రిక్ కొట్టాడు. నరేష్, సత్య ఔట్ స్టాండింగ్. రైటింగ్ డిపార్ట్ మెంట్ కు ప్రశంసలు దక్కాల్సిందే. శ్రీ విష్ణు క్యామియో భారీ ప్రభావం చూపింది. కంగ్రాచ్యులేషన్ అనిల్ సుంకర్ అండ్ టీమ్’’ అని మరో అకౌంట్లో పోస్టు చేశారు.

E-Paper












