సంక్రాంతికి నవ్వులు గ్యారెంటీ.. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ టీజర్ రిలీజ్.. రిలీజ్ డేట్, టైమ్ ఇదే
శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారీ మూవీ టీజర్ వచ్చేసింది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నవ్వులు గ్యారెంటీ అని తేల్చేసింది. మూవీ జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు రానుండటం విశేషం.
శర్వానంద్ నటించిన బైకర్ మూవీ రిలీజ్ వాయిదా పడినా అతని నెక్ట్స్ మూవీ నారీ నారీ నడుమ మురారీ మాత్రం అనుకున్న సమయానికే రానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ ను సోమవారం (డిసెంబర్ 22) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు ప్రేయసిల మధ్య నలిగిపోయే పాత్రలో నవ్వులు పూయిస్తున్నాడు శర్వానంద్.

నారీ నారీ నడుమ మురారీ టీజర్
శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ నారీ నారీ నడుమ మురారీ. ఒకప్పుడు టాలీవుడ్ లో బాలకృష్ణ ఇదే టైటిల్ తో మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు సంక్రాంతికి ఈ కొత్త మూవీ రిలీజ్ కానుంది. టీజర్ లో ఇద్దరు భామలతో ప్రేమాయణం నడిపే పాత్రలో శర్వానంద్ మెప్పించాడు. సామజవరగమన మూవీని డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
సామజవరగమన ఎంతలా నవ్వించిందో మనకు తెలుసు. దీంతో ఈ నారీ నారీ నడుమ మురారీపైనా అంచనాలు పెరిగిపోయాయి. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న శర్వా జీవితంలోకి అతని పాత గర్ల్‌ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. కామెడీ పాత్రలో శర్వా అదరగొట్టబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
నారీ నారీ నడుమ మురారీ రిలీజ్ డేట్, టైమ్
శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారీ సినిమా రిలీజ్ డేట్ తోపాటు టైమ్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేయడం విశేషం. ఈ సినిమాను జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో శర్వానంద్, సంయుక్త, సాక్షితోపాటు నరేష్, సునీల్, సత్య, సుదర్శన్, సంపత్ రాజ్ లాంటి వాళ్లు కూడా నటించారు.
ఇప్పటికే సంక్రాంతికి ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తిలాంటి సినిమాలు రానుండటంతో వాటి మధ్య ఈ నారీ నారీ నడుమ మురారీ మూవీ ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఓసారి శతమానం భవతితో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన అతడు.. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


