2 ఓటీటీల్లో ట్రెండింగ్- నవ్విస్తూ దూసుకుపోతున్న తెలుగు కామెడీ మూవీ జిగ్రీస్- అమెజాన్ ప్రైమ్‌తోపాటు మరోదాంట్లో- ఎక్కడంటే?
ఓటీటీలో నవ్విస్తూ దూసుకుపోతోన్న తెలుగు కామెడీ సినిమా జిగ్రీస్. సందీప్ రెడ్డి వంగా, కిరణ్ అబ్బవరం సపోర్ట్ చేసిన ఈ సినిమా రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దంచికొడుతోంది జిగ్రీస్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌తోపాటు జిగ్రీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో కామెడీ డ్రామాగా వచ్చిన సినిమా జిగ్రీస్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో కిరణ్ అబ్బవరం సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్నేహితుల కామెడీ ట్రిప్‌గా సాగే జిగ్రీస్ ఓటీటీల్లో దూసుకుపోతోంది. ఏకంగా రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో నవ్విస్తూ దూసుకుపోతోంది జిగ్రీస్ మూవీ.

గుండెకు హత్తుకునే భావోద్వేగాలు
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో జిగ్రీస్ సినిమాను ఎగబడి చూస్తున్నారు. కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
కడుపుబ్బ నవ్వించడమే కాకుండా
కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు.
సందీప్ రెడ్డి వంగా సపోర్ట్
కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన జిగ్రీస్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ మరియు చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
రెండింట్లో ట్రెండింగ్
ఇలాంటి జిగ్రీస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు సన్ నెక్ట్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 6న సన్ నెక్ట్‌తోపాటు అమెజాన్ ప్రైమ్‌లో జిగ్రీస్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ రెండింట్లో జిగ్రీస్ ఓటీటీ ట్రెండింగ్ అవడం విశేషంగా మారింది.
జిగ్రీస్ కథ
కాగా, డైరెక్టర్ హరీష్ రెడ్డి దర్శకత్వం వహించిన జిగ్రీస్ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా హీరోలుగా చేశారు. ఇక జిగ్రీస్ కథలోకి వెళితే.. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన నలుగురు ప్రాణ స్నేహితుల కథ ఇది.
మద్యం మత్తులో
ఒక రాత్రి మద్యం మత్తులో, ‘ఇన్ టూ ది వైల్డ్’ అనే ఇంగ్లీష్ సినిమా చూసి స్ఫూర్తి పొంది.. అసలు చేతిలో ఫోన్లు, డబ్బులు, ఐడెంటిటీ కార్డులు ఏవీ లేకుండా పాత మారుతీ 800 కారులో గోవాకు రోడ్ ట్రిప్ బయలుదేరతారు నలుగురు ఫ్రెండ్స్.
అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఓటీటీలు
ఆ ప్రయాణంలో వారికి ఎదురైన వింత అనుభవాలు, సరదా సంఘటనలు, ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. నవ్వులతో మొదలైన వీరి ప్రయాణం, చివరలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ముగుస్తుంది. థియేటర్లలో చూడనివారు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న జిగ్రీస్‌పై లుక్కేయండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


