ఇప్పుడు అన్నయ్యతో మల్టీ స్టార్స్ చేస్తున్నా, సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి- పవన్ కల్యాణ్, మహేశ్ బాబుపై వెంకటేష్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల నిర్వహించిన మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్, మహేశ్ బాబుపై వెంకటేష్ కామెంట్స్ చేశారు.

Published on: Jan 8, 2026, 11:40:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో మల్టీ స్టార్స్ సినిమాలకు పెట్టింది పేరుగా హీరో దగ్గుబాటి వెంకటేష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వెంకటేష్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేసింది.

ఇప్పుడు అన్నయ్యతో మల్టీ స్టార్స్ చేస్తున్నా, సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి- పవన్ కల్యాణ్, మహేశ్ బాబుపై వెంకటేష్ కామెంట్స్
ఇప్పుడు అన్నయ్యతో మల్టీ స్టార్స్ చేస్తున్నా, సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి- పవన్ కల్యాణ్, మహేశ్ బాబుపై వెంకటేష్ కామెంట్స్

సంక్రాంతి కానుకగా రిలీజ్

సంక్రాంతి కానుకగా జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేష్.

ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్

విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను. ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే" అని అన్నారు.

ఇదే సంక్రాంతి స్పిరిట్

"నేను మా తమ్ముళ్లు పవన్ కల్యాణ్‌తో మహేశ్ బాబుతో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్య (చిరంజీవి)తో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్‌తో నాది వండర్‌ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు. తన రైటింగ్ టీం. టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని వెంకటేష్ తెలిపారు.

సంక్రాంతి సినిమాలు అన్నీ

"మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని హీరో వెంకటేష్ ఆకాంక్షించారు.

తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే

"తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్" అని వెంకటేష్ తన స్పీచ్ ముగించారు.

ఏఎస్ ప్రకాష్ కామెంట్స్

ఇదే ఈవెంట్‌లో ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి గారికి, విక్టరీ వెంకటేష్ గారికి, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

చక్కని పాట రాయించుకున్నారు

లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. "మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు పాటలు రాయడం ఎప్పుడూ ఆనందకరమైన విషయం. ఈ సినిమాలో కూడా చక్కని పాట రాయించుకున్నారు. నా పాట ఈ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఆ పాట చూడ్డానికి నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా సంక్రాంతికి గొప్ప విజయాన్ని నమోదు చేయబోతోంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More