రెండు తమిళ సినిమాలు సంక్రాంతి క్లాష్-జన నాయగన్ రిలీజ్‌పై విజయ్ కు కాల్ కూడా చేశా: శివ కార్తికేయన్ షాకింగ్ రియాక్షన్

విజయ్ 'జన నాయగన్' సినిమాతో తన 'పరాశక్తి' మూవీ పోటీ పడటంపై శివకార్తికేయన్ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో స్పందించారు. ఈ విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. రిలీజ్ డేట్ గురించి విజయ్ కు కాల్ కూడా చేశానన్నారు. ఈ రెండు సినిమాలు 2026 సంక్రాంతి రేసులోకి వస్తున్నాయి. 

Published on: Jan 4, 2026, 14:52:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రెండు తమిళ సినిమాలు ఢీ కొడుతున్నాయి. స్టార్ హీరో విజయ్ మూవీ ‘జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు)’, శివ కార్తికేయన్ చిత్రం ‘పరాశక్తి’ బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాయి. జనవరి 9న జన నాయగన్, జనవరి 10న పరాశక్తి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ రిలీజ్ డేట్ పై శివ కార్తికేయన్ షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారింది.

జన నాయగన్, పరాశక్తి క్లాష్
జన నాయగన్, పరాశక్తి క్లాష్

పరాశక్తి వర్సెస్ జన నాయగన్

పరాశక్తిని మొదట 2025 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారని, కానీ అప్పుడు జన నాయగన్ తో క్లాష్ కాకుండా వాయిదా వేశామని శివ కార్తికేయన్ అన్నారు. దీంతో 2026 సంక్రాంతికి పరాశక్తి రిలీజ్ చేయాలని అనుకున్నారు. మరోవైపు జన నాగయన్ ప్రొడ్యూసర్లు కూడా వచ్చే సంక్రాంతిపైనే కన్నేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పరాశక్తి వర్సెస్ జన నాయగన్ క్లాష్ తప్పలేదు.

శివ కార్తికేయన్ కామెంట్లు

పరాశక్తి ఈవెంట్లో జన నాయగన్ రిలీజ్ డేట్, విజయ్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు శివ కార్తికేయన్.

"జన నాయగన్ రిలీజ్ డేట్ తెలిసి నేను షాక్ అయ్యా. మనం తేదీని మార్చుకోవచ్చా అని మా నిర్మాతకు కాల్ చేసి అడిగాను. అయితే ఇన్వెస్టర్లందరికీ మా పొంగల్ విడుదల గురించి ఇప్పటికే చెప్పేశారు. ఇక 2026 వేసవిలో రిలీజ్ చేద్దామంటే అప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా అది కష్టమవుతుందని ప్రొడ్యూసర్ చెప్పారు" అని శి కార్తికేయన్ అన్నారు.

విజయ్ తో ఫోన్లో

ఈ సమస్యను పరిష్కరించడానికి విజయ్ తో మాట్లాడానని కూడా శివ కార్తికేయన్ పేర్కొన్నారు. విజయ్ మేనేజర్ జగదీష్ కు కాల్ చేసి.. "మీకు సమస్య ఉండకపోవచ్చు, కానీ నాకు ఉంటుంది. 'జన నాయగన్' విజయ్ సార్ చివరి సినిమాగా ప్రచారమవుతోంది. దాని గురించి ఒకసారి సార్ ని అడగగలరా?" అని ఆయన అన్నట్లు శివకార్తికేయన్ చెప్పారు.

పొంగల్ కాబట్టి ప్రాబ్లం లేదని

విజయ్ తో మాట్లాడిన తర్వాత జగదీష్ తనకు తిరిగి కాల్ చేశారని శివకార్తికేయన్ తెలిపారు. "విజయ్ సార్ అభిప్రాయం ప్రకారం, ఇది పొంగల్ కాబట్టి, రెండు సినిమాలకు విడుదల కావడానికి తగినంత స్థలం ఉందని, బాక్సాఫీస్ వద్ద ఒకదానికొకటి ప్రభావితం చేయవని ఆయన చెప్పారు. సర్ 'పరాశక్తి'కి శుభాకాంక్షలు కూడా తెలిపారు. కాబట్టి అందరూ దయచేసి జనవరి 9న 'జన నాయగన్' ని ఆస్వాదించండి. 33 సంవత్సరాలుగా మమ్మల్ని అలరించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. జనవరి 10న పరాశక్తి చూడండి’’ అని శివ కార్తికేయన్ అన్నారు.

భగవంత్ కేసరిలా

మరోవైపు జన నాయగన్ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. శనివారం (జనవరి 3) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది చూస్తే మూవీ స్టోరీ, సీన్లు భగవంత్ కేసరి సినిమాలాగే ఉన్నాయనే కామెంట్లు వస్తున్నాయి. జన నాయగన్ లో దళపతి విజయ్, పూజ హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులు నటిస్తున్నారు. పరాశక్తిలో శివ కార్తికేయన్, శ్రీలీల లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More