ఆ ఓటీటీలోకే శ్రీలీల తమిళ డెబ్యూ మూవీ-శివ కార్తికేయన్ హీరో-రియల్ స్టోరీతో!
యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల తమిళ డెబ్యూ చేయనున్న పరాశక్తి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు ఓ ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది.
మోస్ట్ అవైటెడ్ తమిళ సినిమాల్లో పరాశక్తి ఒకటి. ఇందులో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. శ్రీలీలకు ఇదే ఫస్ట్ తమిళ చిత్రం. ఈ మూవీతోనే ఆమె కోలీవుడ్ లో అడుగుపెడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఓటీటీ పార్ట్ నర్ కన్ఫామ్ అయినట్లు తెలిసింది.

పరాశక్తి ఓటీటీ
శ్రీలీల తమిళ అరంగేట్ర చిత్రం పరాశక్తి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో తెలిపోయింది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ భారీ ధరకు కొనుగోలో చేసిందని టాక్. ఇందుకోసం మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. థియేట్రికల్ రన్ తర్వాత పరాశక్తి మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది.
రిలీజ్ డేట్
పరాశక్తి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 14న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. సాధారణంగా నాలుగు వారాల థియేటర్ విండో తర్వాత సౌత్ సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే పరాశక్తి మూవీ ఫిబ్రవరి రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
రియల్ స్టోరీతో
పరాశక్తి సినిమా రియల్ స్టోరీతో తెరకెక్కుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు డైరెక్టర్ సుధా కొంగర. సూర్య హీరోగా వచ్చిన ఆకాశమే నీ హద్దురా మూవీతో సుధా కొంగర పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇదో పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వస్తుంది.
శ్రీలీల ఇలా
ఇప్పటివరకూ గ్లామర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన శ్రీలీల పరాశక్తిలో మాత్రం యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె తెలుగు నేపథ్యం ఉన్న అమ్మాయిగా ఈ మూవీలో నటించారని తెలిసింది. అలాగే తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్లు కూడా సమాచారం. పరాశక్తి సినిమాలో శివ కార్తికేయన్, శ్రీలీలతో పాటు జయం రవి, అథర్వ మురళి, రవి మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్
శ్రీలీల చివరగా రవితేజ మూవీ మాస్ జాతరలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం హిందీలో ఓ సినిమాతో పాటు తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ నటిస్తోంది శ్రీలీల.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


