ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్-ప్రేమను కొలిచే లవ్ మీటర్-చివర్లో ట్విస్ట్
ఇవాళ ఓటీటీలోకి ఓ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ రొమాంటిక్ థ్రిల్లర వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. లవ్ కొలిచే మీటర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సిరీస్ ఏంటో చూసేయండి.
డిఫరెంట్ స్టోరీ, కాన్సెప్ట్ తో సినిమాలు, సిరీస్ లు ఓటీటీలోకి వస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా విభిన్నమైన కథాంశంతో ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టింది. అదే.. ‘హార్ట్‌లీ బ్యాటరీ’. ఈ తమిళ సిరీస్ ఇవాళ (డిసెంబర్ 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

హార్ట్‌లీ బ్యాటరీ ఓటీటీ
ఓటీటీలోకి మంగళవారం అడుగుపెట్టిన తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హార్ట్‌లీ బ్యాటరీ. ఈ రోజు నుంచి ఇది డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులో ఉంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో హార్ట్‌లీ బ్యాటరీ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. జీ5 ఒరిజినల్ గా ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతానికి కేవలం తమిళ భాషలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఆరు ఎపిసోడ్లు
హార్ట్‌లీ బ్యాటరీ వెబ్ సిరీస్ ఆరు ఎపిసోడ్లు ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ లవ్ వర్సెస్ లాజిక్ ను ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. కానీ ఆ తర్వాతి ఎపిసోడ్లు ది ఛాలెంజ్ బిగిన్స్, ది 12 అవర్స్ రూల్, సిగ్నల్స్ అండ్ సైలెన్స్, జీరో లవ్, లవ్ బియాండ్ లాజిక్ మాత్రం సబ్ స్క్రైబ్ చేసుకుంటూనే చూసే ఛాన్స్ ఉంది. ఈ ఆరు ఎపిసోడ్లు ఒకే సారి రిలీజ్ అయ్యాయి.
సైన్స్ ఫిక్షన్
హార్ట్‌లీ బ్యాటరీ వెబ్ సిరీస్ ఓ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఇందులో గురు లక్ష్మణ్, పదినె కుమార్, అనిత్ యశ్పాల్, సుమిత్ర, జీవ రవి, షర్మిల, ఇనియల్ తదితరులు నటించారు. ఈ సిరీస్ ను తమిళంలో చూడొచ్చు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
హార్ట్‌లీ బ్యాటరీ స్టోరీ
ప్రేమ అనేది కేవలం సైన్స్ లో ఓ పార్ట్ మాత్రమే అని నమ్మే అమ్మాయి సోఫియా (పదినె కుమార్). హార్ట్ ఫుల్ లవ్ అనేది లేదని అంటుంది. అందుకే సోఫియా ఓ లవ్ మీటర్ కనిపెడుతుంది. ఈ లవ్ మీటర్ తో ఒకరిపై మనకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చని చెబుతుంది. సోఫియా ఫ్రెండ్స్, ఇతరులు ఈ లవ్ మీటర్ వాడి తమ ప్రేమను చెక్ చేసుకుంటారు. కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ కు తమ గర్ల్ ఫ్రెండ్ మీద లవ్ లేదని ఈ మీటర్ చెప్పే సీన్లు ఫన్నీగా ఉంటాయి.
మరోవైపు సిద్ ఓ రైటర్. సోఫియాను చూసి ఇష్టపడతాడు. 12 గంటల్లో ప్రేమలో పడేయకపోతే సోఫియాకు కనిపించను అని చెబుతాడు. ఇక లవ్ మీటర్ తో చెక్ చేసుకుంటే సోఫియాకు కూడా ప్రేమ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ సోఫియా ఫ్రెండ్ ఈ లవ్ మీటర్ కారణంగా సూసైడ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రేమను కొలవాలంటే ఓ యంత్రం సరిపోతుంది? మిషన్ ను దాటి నిజమైన ప్రేమను అందించలేరా? అనే ప్రశ్నలకు ఈ సిరీస్ లో సమాధానం దొరుకుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


