ఓటీటీలోకి పాపులర్ వెబ్ సిరీస్ లాస్ట్ పార్ట్.. అదరగొట్టే హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సాధించిన క్రేజీ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్ లో లాస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ పార్ట్ ఓటీటీ రిలీజ్ కు ముందు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వెబ్ సిరీస్ ఏదో ఇక్కడ చూసేయండి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సైన్స్-ఫిక్షన్ సిరీస్ ఎండ్ పార్ట్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ముగింపు భాగంపై అంచనాలను పెంచుతూ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వెబ్ సిరీస్ పేరే స్ట్రేంజర్ థింగ్స్. వరల్డ్ వైడ్ గా ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్ సీజన్ 5 సీజన్ 5 వాల్యూమ్ 2 త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఓటీటీ
హారర్ ఎలిమెంట్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ సిరీస్ అన్ని సీజన్లూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 కూడా అదరగొట్టింది. ఇక ఈ సిరీస్ కు ఎండింగ్ పార్ట్ అయిన పార్ట్ 2 కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఇండియన్ ఆడియన్స్ ఈ పార్ట్ 2ను డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
ట్రైలర్ ఔట్
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 అధికారిక ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. కొత్త ట్రైలర్.. భయంకరమైన వెక్నా, అప్‌సైడ్ డౌన్‌లోని లోతైన రహస్యాలతో హాకిన్స్ అంతిమ పోరాట తీవ్రమైన దృశ్యాన్ని అందిస్తుంది. సుదీర్ఘంగా నడుస్తున్న కథనం ముగింపుకు చేరుకుంటున్నందున ప్రమాద స్థాయి గణనీయంగా పెరుగుతోందని సంకేతమిస్తుంది. విడుదలైన ట్రైలర్‌లో తెలిసిన ముఖాలు పెరుగుతున్న అపాయాలతో పోరాడుతున్నాయి.
లాస్ట్ సీజన్
స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ప్రారంభం నుండి దానిని నడిపిస్తున్న మిలిలీ బాబీ బ్రౌన్ (ఎలెవన్), ఫిన్ వోల్ఫ్‌హార్డ్ (మైక్ వీలర్), గేటెన్ మటరాజ్జో (డస్టిన్ హెండర్సన్), నోహ్ ష్నాప్ (విల్ బైర్స్), వినోనా రైడర్ (జోయస్ బైర్స్), డేవిడ్ హార్బర్ (జిమ్ హాప్పర్), సేడీ సింక్ (మాక్స్ మేఫీల్డ్), నటాలియా డైయర్ (నాన్సీ వీలర్), జో కెరీ (స్టీవ్ హారింగ్టన్) వంటి నటీనటులు సీజన్ 5 పార్ట్ 2లో తిరిగి వస్తున్నారు. చివరి సీజన్‌లో లిండా హామిల్టన్, నెల్ ఫిషర్, జేక్ కాన్నెల్లీ మరియు అలెక్స్ బ్రెయుక్స్ వంటి అదనపు నటీనటులు కూడా ఉన్నారు.
మూడు ఎపిసోడ్ లు
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ నాలుగు ఎపిసోడ్లు నవంబర్ 26, 2025న రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాల్యూమ్ 2లోని మూడు ఎపిసోడ్ లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇండియాలోని ఆడియన్స్ డిసెంబర్ 26న నుంచి వీటిని చూసే అవకాశముంది. ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న ఓటీటీలోకి వస్తుంది.














