ఓటీటీలో అదరగొడుతున్న హీరో రాజశేఖర్ కూతురు సినిమా.. ట్రెండింగ్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ.. మీరు చూశారా?
ఓటీటీలో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ మూవీ అదరగొడుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆరోమలే ఓటీటీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి ఈ వైరల్ మూవీని మీరు చూశారా? ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి.
డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన రొమాంటిక్ మూవీ ఆరోమలే ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్. తమిళ ఒరిజినల్ ఫిల్మ్ అయిన ఆరోమలే ఓటీటీ స్ట్రీమింగ్ లో తెలుగులోనూ సత్తాచాటుతోంది.

ఆరోమలే ఓటీటీ
తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆరోమలే ఓటీటీలో రాణిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఓటీటీ డెబ్యూలో ఆరోమలే సినిమా సత్తాచాటుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఆరోమలే మూవీ. దీనికి దర్శకుడు సారంగ్ తియాగు. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జోడీగా నటించారు.
ట్రెండింగ్ లో
ఆరోమలే సినిమా జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ జై కొడుతున్నారు. ఈ చిత్రం ఓటీటీలో అయిదు భాషల్లో రిలీజైంది. హిందీ తప్ప మిగతా నాలుగు భాషల్లో టాప్-5లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. ఇక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలను పక్కనపెడితే సినిమాల్లో తెలుగు, తమిళంలో ఆరోమలే ట్రెండింగ్ లో ఉంది.
తెలుగులో నంబర్ వన్
ఓటీటీ సినిమాల్లో ఆరోమలే జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఓవరాల్ గా తెలుగులో బిగ్ బాస్ 9 తెలుగు, ఆదివారం విత్ స్టార్ మా పరివారం తర్వాత మూడో స్థానంలో ఉంది ఆరోమలే. కానీ సినిమాల్లో మాత్రం దీనిదే ఫస్ట్ ప్లేస్. ఇక తమిళంలోనూ సినిమాల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా ఉంది ఆరోమలే. మలయాళంలో మూడో ప్లేస్, కన్నడలో నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఆరోమలే స్టోరీ
ఆరోమలే మూవీ ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా. అజిత్ (కిషన్) ప్రేమ కోరుకునే వ్యక్తి. సినిమాల్లో చూపించినంత అద్భుతంగా ప్రేమ ఉండాలని ఆశిస్తాడు. కానీ అతనికి మాత్రం వరుసగా హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ తో సాగిపోతున్న అజిత్ ను ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగం చేయమని పేరేంట్స్ పంపిస్తారు.
మ్యాట్రిమోనీ ఏజెన్సీ బాస్ అంజలి (శివాత్మిక రాజశేఖర్). ఆమె పెళ్లిళ్లు చేయిస్తుంటుంది కానీ ప్రేమపై పెద్ద ఒపీనియన్ అంటూ ఏం ఉండదు. ప్రేమ అద్భుతం కాదని, అది కేవలం అవసరాల కోసమే అని నమ్ముతుంది. అది లాజిక్ మాత్రమే అని అంటుంది. మరి అజిత్ రొమాంటిక్ లవ్ కలలకు. అంజలి లాజికల్ విధానానికి సెట్ అయిందా? అజిత్ కు నిజమైన లవ్ దొరికిందా? అన్నది ఆరోమలే సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


