ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్‌లో రష్మిక మందన్న రొమాంటిక్ మూవీ..ఇండియాలో నంబర్‌వన్..డైరెక్టర్ పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
థియేటర్లలో సత్తాచాటిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఇండియాలో టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ. ఇందులో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.

ఓటీటీ ట్రెండింగ్
రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఇది డిసెంబర్ 5న ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఓటీటీలోనూ అదుర్స్ అనిపిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే టాప్ లోకి దూసుకెళ్లింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.
రొమాంటిక్ మూవీ
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఇది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. టాక్సిక్ రిలేషన్ షిప్ లో నుంచి బయటపడాలనే ఓ అమ్మాయి పోరాటంగా ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా నవంబర్ 7, 2025న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
ప్రతి రోజు కాదు
నెట్‌ఫ్లిక్స్ లో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతుండటంపై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘‘ప్రతి రోజు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసినప్పుడు మా సినిమా ఇలా ఇండియాలో నంబర్ వన్ గా ఉండదు’’ అని వీడియోను షేర్ చేశాడు రాహుల్ రవీంద్రన్. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ది గర్ల్‌ఫ్రెండ్ స్టోరీ
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ భూమా దేవి (రష్మిక మందన్న), విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కథ. ఇది విమెన్ సెంట్రిక్ లవ్ డ్రామా. భూమా దేవి హైదరాబాద్ వచ్చి ఎంఏ లిటరేచర్ చదువుతుంటుంది. ఆమె అమాయకమైన యువతి. తండ్రి (రావు రమేష్) చాటున పెరిగిన అమ్మాయి. కాలేజీలో విక్రమ్ తో స్నేహం, తర్వాత లవ్ భూమా లైఫ్ ను మలుపు తిప్పుతుంది.
ఈ ప్రేమలో విక్రమ్ నియంతలా ప్రవర్తించడం, అనుమానపడటం భూమాకు నచ్చదు. ఇది ప్రేమ కాదు, ఒక జైలు అని భావించిన భూమా ఏం చేసింది? ఇందులో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఏంటీ? అనేది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


