ఓటీటీలో అదరగొడుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3.. రికార్డులు బ్రేక్.. 35 దేశాల్లో ట్రెండింగ్.. సమంత భర్త డైరెక్టర్

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఓటీటీలో అదరగొడుతోంది. రికార్డులు తిరగరాస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ డైరెక్టర్లలో సమంత భర్త రాజ్ నిడిమోరు కూడా ఒకరు. 

Published on: Dec 6, 2025, 17:36:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనోజ్ బాజ్‌పేయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్‌ రికార్డులు తిరగరాస్తోంది. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ భారీ సక్సెస్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సిరీస్ 35కు పైగా దేశాలలో టాప్-5లో ట్రెండ్ అయింది. ఇంకా ఇతర రికార్డులూ ఖాతాలో వేసుకుంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పోస్టర్
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 పోస్టర్

ఓటీటీ ట్రెండింగ్ లో

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రికార్డులు బద్దలు కొట్టింది. నాలుగు సంవత్సరాలకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రజాదరణ పొందిన షో మూడవ సీజన్ నవంబర్ 21న విడుదలైంది. తొలి వారంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' భారతదేశంలోని 96% జిల్లాలలో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు యుకె, ఆస్ట్రేలియా, కెనడా, యుఎఇ, సింగపూర్, మలేషియా వంటి 35కు పైగా దేశాలలో టాప్ 5 ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచిందని వెరైటీ నివేదించింది. 2019, 2021లో విడుదలైన మునుపటి రెండు సీజన్‌ల రికార్డులను అధిగమించిన సీజన్ 3 ఓటీటీలో అదరగొడుతోంది.

అత్యధిక వీక్షణలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రైమ్ వీడియో ఇండియాలో తొలి వారంలోనే 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3.. 2025లో అత్యధికంగా వీక్షించిన సిరీస్ గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఇతర సిరీస్ లను అన్నింటినీ ఇది అధిగమించింది.

సమంత భర్త

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలో రాజ్ నిడిమోరు ఒకరు. ఈ సిరీస్ సృష్టికర్తలు, దర్శకులు, రచయితలు అయిన రాజ్ & డికె నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3కి లభించిన అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అద్భుతమైన ఆదరణ

ప్రైమ్ వీడియో ఇండియాలో ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ అయిన నిఖిల్ మధోక్ కూడా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశాడుు. 'ఉత్కంఠభరితమైన కథ, అసాధారణమైన నటన, రాజ్, డికె సిగ్నేచర్ విచిత్రం, వారి విభిన్న కథన శైలి, గుండె వేగాన్ని పెంచే థ్రిల్స్‌తో కలిసి ఈ సిరీస్ ప్రేక్షకుల అభిమానంగా మారడానికి కారణమయ్యాయని' వెరైటీ మధోక్‌ను ఉటంకించింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 గురించి..

ఈ ఫ్రాంచైజీ తాజా ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనోజ్ బాజ్‌పేయ్ శ్రీకాంత్ తివారీగా తిరిగి వచ్చాడు. ఈ సీజన్‌లో ప్రధాన విలన్ రుక్మాగా జైదీప్ అహ్లావత్ నటించాడు. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో శాంతి చర్చలు విఫలమవ్వడానికి గల కారణాలను ఛేదించే బాధ్యత తివారీకి అప్పగిస్తారు. అయితే తన ప్రేయసి మరణానికి తివారీనే బాధ్యుడని రుక్మా నమ్ముతాడు. దీంతో తివారీ కుటుంబంపై తీవ్రమైన దాడి జరుగుతుంది.

బాజ్‌పేయ్, అహ్లావత్‌తో పాటు ఈ మూడవ సీజన్‌లో నిమ్రత్ కౌర్, అలాగే షరీబ్ హష్మీ, ప్రియమణి, అశేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయ ధన్వంతరీ, గుల్ పనాగ్ తదితరులు కూడా నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More