నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో సౌత్ సినిమాల డామినెన్స్‌- ఎక్కువ మంది చూసిన త‌మిళ‌, తెలుగు సినిమాలు-ఓ లుక్కేయండి

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ ఇండియా సినిమాల డామినెన్స్ మామూలుగా లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలు ఈ ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఎక్కువ మంది చూసిన ఈ సినిమాలు ఏవో ఓ లుక్కేయండి.  

Published on: Dec 15, 2025, 11:52:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ సినిమాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ట్రెండింగ్ లో మిగతా సినిమాల కంటే టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి. ఇందులో దుల్కర్ సల్మాన్ కాంత నుంచి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ టాప్-10 లిస్ట్ పై ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ సినిమాలు
నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్ సినిమాలు

కాంత ఓటీటీ

దుల్కర్ సల్మాన్ తన కొత్త చిత్రం కాంతతో మరోసారి ప్రేక్షకుల మధ్య తన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. తమిళ చిత్రం కాంత నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ఒక పాత చలనచిత్ర యుగం కథను చెబుతుంది. దీనిలో హీరో, డైరెక్టర్ మధ్య ఈగోను చూపించారు.

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ

రష్మిక మందన్న నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ తెలుగు మూవీ లో ఆమె నటన తనకెంతో నచ్చిందని జాన్వీ కపూర్ చెప్పింది. ఈ సినిమాను చూడమని ప్రేక్షకులను కోరింది జాన్వీ కపూర్. ఇది గత వారం నెట్‌ఫ్లిక్స్‌లో 1 వ స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.

వేక్ అప్ డెడ్ మ్యాన్

మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన అమెరికన్ చిత్రం. ఈ చిత్రానికి రియాన్ జాన్సన్ దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.

స్టీఫెన్

నెట్ ఫ్లిక్స్ లో నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతున్న చిత్రం స్టీఫెన్. ఇది తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో ఓ సైకో 9 మంది అమ్మాయిలను చంపుతాడు. జే కుమార్, నిషా వర్మ జంటగా నటించిన చిత్రం ఇది.

సన్నీ సంస్కారీ కి తులసి కుమారి

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సన్నీ సంస్కారీ కి తులిసి కుమారి చిత్రం ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు థియేటర్ లో పెద్దగా వసూళ్లు రాకపోయినా నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు మాత్రం నచ్చింది.

జాలీ ఎల్ ఎల్ బి 3

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'జాలీ ఎల్ ఎల్బీ 3' ఓటీటీలోకి వచ్చి కొన్ని నెలలు గడిచినా ట్రెండింగ్ లిస్ట్ లో కొనసాగుతోంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులకు నచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా 6వ స్థానంలో ట్రెండ్ అవుతోంది

ఆర్యన్

తమిళంలో విష్ణు విశాల్, ప్రియా ఆనంద్ జంటగా తెరకెక్కించిన ఆర్యన్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం గత రెండు వారాలుగా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది. ఎమోషన్, రిలేషన్స్ ఆధారంగా ఈ సినిమా కథ రూపొందింది.

డ్యూడ్

నేటి న్యూ జనరేషన్ మూవీ డ్యూడ్. ఇందులో ప్రదీప్ రంగనాథన్, మమితా జంటగా నటించారు. ఇది జెన్ జడ్ స్నేహం, ప్రేమను చాటుతుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 8వ స్థానంలో ఉంది.

హోమ్ బౌండ్

ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'హోమ్ బౌండ్' చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 9వ స్థానంలో ఉంది.

ఇడ్లీ కడై

సౌత్ సూపర్ స్టార్ ధనుష్ దర్శకత్వంలో ఇడ్లీ కడై తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో కూడా అతనే. ఓ ఫ్యామిలీ షాప్ ఆధారంగా ఈ సినిమా కథ సాగుతోంది. గత కొన్ని వారాలుగా ఈ సినిమా వార్తల్లో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More