ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా: రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్‌పై జాన్వీ కపూర్ రివ్యూ

రష్మిక మందన్నా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు జాన్వీ కపూర్ రివ్యూ ఇచ్చింది. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా అని ఆమె అనడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక్క ముక్కలో మూవీ రివ్యూ ఇచ్చింది.

Published on: Dec 8, 2025, 15:55:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'జిగ్రా' నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన మూడవ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు ఓటీటీలో విశేష స్పందన లభిస్తోంది. తాజాగా స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయింది.

ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా: రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్‌పై జాన్వీ కపూర్ రివ్యూ
ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా: రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్‌పై జాన్వీ కపూర్ రివ్యూ

జాన్వీ కపూర్ ఏమన్నదంటే?

సోమవారం (డిసెంబర్ 8) నాడు జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలోని ఒక కీలకమైన సీన్‌ను షేర్ చేసింది. రంగులు పూసుకుని, మైక్ ముందు నిల్చుని, కళ్లపై పడుతున్న కాంతిని అడ్డుకుంటున్న రష్మిక ఫోటోను ఆమె పోస్ట్ చేసింది.

దీనికి కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, చప్పట్ల ఎమోజీలను జత చేస్తూ.. "ది గర్ల్‌ఫ్రెండ్. మాండేటరీ వాచ్ (తప్పక చూడాల్సిన సినిమా)" అని రాసుకొచ్చింది. జాన్వీ ప్రశంసపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. "ఆమెది చాలా మంచి మనసు" అంటూ హార్ట్ ఎమోజీతో కృతజ్ఞతలు తెలిపాడు.

'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా గురించి..

'చి ల సౌ' (2018), 'మన్మథుడు 2' (2019) తర్వాత రాహుల్ రవీంద్రన్ స్వీయ రచన, దర్శకత్వంలో వచ్చిన మూడవ సినిమా ఇది. ఇందులో రష్మిక (భూమ), దీక్షిత్ (విక్కీ), అను (దుర్గా) స్టూడెంట్స్ పాత్రల్లో నటించారు.

భూమ, విక్కీల మధ్య సాగే కల్లోలమైన ప్రేమకథ ఇది. తాను ఒక విషపూరితమైన బంధంలో చిక్కుకున్నానని హీరోయిన్ ఎలా గ్రహించింది, దాని నుంచి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కథాంశం. మిక్స్‌డ్ రివ్యూలు అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 29.08 కోట్లు వసూలు చేసింది. ఇందులో దర్శకుడు రాహుల్ కూడా ప్రొఫెసర్‌గా ఒక అతిథి పాత్రలో మెరిశాడు.

జాన్వీ, రష్మిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్

2024లో ఎన్టీఆర్ 'దేవర: పార్ట్ 1'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఈ ఏడాది హిందీలో 'హోమ్‌బౌండ్', 'పరమ్ సుందరి', 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

ఈ ఏడాది హిందీలో 'ఛావా', 'సికందర్', 'థామా' సినిమాలతో పాటు తెలుగు-తమిళ చిత్రం 'కుబేర', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో 'కాక్‌టెయిల్ 2', తెలుగులో 'మైసా' చిత్రాల షూటింగ్‌లో ఉంది. నటుడిగా రాహుల్ చివరగా హిందీలో 'జిగ్రా', తెలుగులో పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రాల్లో కనిపించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More