బాలయ్య ఫ్యాన్స్‌కు ముందుగానే సంక్రాంతి పండగ.. అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వీళ్లకు సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేస్తోంది. బాలయ్య లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ సమాచారం వచ్చింది. మరి ఈ మూవీ ఎప్పుడు? ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేయండి.
బాలయ్య ఫ్యాన్స్ కు 2026 సంక్రాంతి పండగ ముందే రానుంది. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం ఓటీటీ డేట్ రివీలైంది. సంక్రాంతికి ముందుగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.

అఖండ 2 ఓటీటీ
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ మైథాలజీ థ్రిల్లర్ అఖండ 2. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా ఈ మూవీ థియేటర్లో రిలీజైంది. ఇప్పుడీ సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్లనుంది. ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 9 నుంచి అఖండ 2 తాండవం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయిదు భాషల్లో
అఖండ 2 సినిమా అయిదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అఖండ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను డైరెక్టర్. ఇందులో బాలయ్యతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ తదితరులు నటించారు.
థియేటర్లో ఇలా
థియేటర్లో అఖండ 2 మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5, 2025న రిలీజ్ కావాల్సింది. కానీ ఈరోస్ ఇంటర్నేషనల్ తో మనీ గొడవ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అఖండ 2కు నెగెటివ్ టాక్ వచ్చింది. అఖండ మూవీలా అఖండ 2 సక్సెస్ అందుకోలేకపోయింది.
అఖండ 2 స్టోరీ
అఖండ సినిమాలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, తన తమ్ముడి కూతురు కోసం పోరాటం చేస్తాడు రుద్ర సికిందర్ అఘోరా. ఆ సినిమాలో దొంగ బాబా, అక్రమ మైనింగ్, అమాయక ప్రజలను చంపడం చుట్టూ కథ సాగుతోంది. కానీ అఖండ 2కు వచ్చేసరికి అది ఇండియా వర్సెస్ చైనా వార్ వరకూ వెళ్తుంది.
ఇండియాలో జరిగే కుంభమేళాను టార్గెట్ గా చేసుకుని చైనా బయోవార్ ప్లాన్ చేస్తుంది. కుంభమేళాలో స్నానం చేసిన వాళ్లలో చాలా మంది అపస్మారక స్థితికి వెళ్లిపోతారు. దీనికి మన సైంటిస్ట్ లు వ్యాక్సిన్ కనిపెడతారు. కానీ అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ ను నాశనం చేసి, అందరినీ చంపేస్తారు.
జనని కోసం
ఆ ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ తో జనని ఒక్కరే బయటపడుతుంది. ఆమెను చంపేందుకు వెంటపడతారు. అప్పుడే రుద్ర సికిందర్ అఘోరా ఎంట్రీ ఇస్తాడు. జనని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. అసలు జనని ఎవరు? ఆమెకు ఆపద వచ్చిందనే విషయం రుద్రకు ఎలా తెలిసింది? చివరకు ఏమైంది అన్నది అఖండ 2లో చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


