అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాలను వెనక్కి నెట్టేసిన చిరంజీవి- మన శంకర వరప్రసాద్ గారు 2 డేస్ కలెక్షన్స్ ఇవే!
రెండేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి సందడి మొదలైంది. చిరు తాజా చిత్రం 'మన శంకర వరాప్రసాద్ గారు' తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 65.75 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాలను వెనక్కి నెట్టేసింది చిరంజీవి మూవీ.
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. సుమారు రెండేళ్ల నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన మార్కు బాక్సాఫీస్ పవర్‌తో అభిమానులను అలరిస్తున్నారు.

రికార్డ్ స్థాయి వసూళ్లతో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరాప్రసాద్ గారు' చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, 'వింటేజ్ చిరంజీవి'ని చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
చిరంజీవి కెరీర్‌లోనే మన శంకర వరప్రసాద్ గారు రెండో అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తొలి రోజే భారత్‌లో రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
పెయిడ్ ప్రీవ్యూలతో
ఆదివారం (జనవరి 11) జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా వచ్చిన రూ. 8.75 కోట్లను కలిపితే, దేశీయంగా తొలి రోజు మొత్తం రూ. 37.50 కోట్ల నెట్ (రూ. 44.75 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్‌లో కూడా మెగాస్టార్ హవా నడుస్తోంది, అక్కడ సుమారు 2.3 మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.
మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 65.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. చిరంజీవి కెరీర్‌లో 2019 నాటి 'సైరా నరసింహారెడ్డి' (రూ.85 కోట్లు) తర్వాత ఇదే అత్యుత్తమ వసూళ్లు కావడం విశేషం.
మేనల్లుడి రికార్డు బ్రేక్!
అయితే, వరల్డ్ వైడ్‌గా తొలి రోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు రూ. 84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ లెక్కన చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప 2 ది రైజ్ తొలి రోజు కలెక్షన్స్ (రూ. 62.50 కోట్లు)ను మన శంకర వరప్రసాద్ సినిమా బీట్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (రూ. 57.80 కోట్లు) కలెక్షన్స్‌ను కూడా నెట్టేసింది ఈ మూవీ. ఇక హిందీలో సూపర్ హిట్ మూవీ అయిన 'గదర్ 2' (రూ. 53.20 కోట్లు) వసూళ్లను సైతం చిరంజీవి మూవీ బ్రేక్ చేసేసింది.
ప్రభాస్ సినిమా తగ్గడంతో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' వసూళ్లు భారీ ఓపెనింగ్ తర్వాత నెమ్మదించడంతో ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి సినిమాపైనే ఉంది.
ఇక రెండో రోజున మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఇండియాలో రూ. 15.56 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ పేర్కొంది. దీంతో భారతదేశంలో 2 రోజుల్లో చిరంజీవి సినిమాకు రూ. 53.06 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


