ది రాజా సాబ్ రివ్యూ- నానమ్మ కోసం దుష్ట శక్తితో పోరాటం- ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ మెప్పించిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ ఫాంటసీ మూవీ ది రాజా సాబ్. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ది రాజా సాబ్ ఇవాళ (జనవరి 9) థియేటర్లలో విడుదలైంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి ది రాజా సాబ్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jan 9, 2026, 12:49:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: ది రాజా సాబ్

ది రాజా సాబ్ రివ్యూ- నానమ్మ కోసం దుష్ట శక్తితో పోరాటం- ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ మెప్పించిందా?
ది రాజా సాబ్ రివ్యూ- నానమ్మ కోసం దుష్ట శక్తితో పోరాటం- ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ మెప్పించిందా?

నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వీటీవీ గణేష్, సత్య, సప్తగిరి తదితరులు

కథ, దర్శకత్వం: మారుతి

సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: తమన్

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా

విడుదల తేది: 9 జనవరి 2026

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఫాంటసీ హారర్ కామెడీ సినిమా వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తోడు ముగ్గురు హీరోయిన్స్, హారర్ కామెడీని బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ మారుతి దర్శకత్వం కావడంతో ది రాజా సాబ్‌పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

నానమ్మ కోసం దుష్ట శక్తులతో మనవడు చేసే పోరాటంగా సాగిన ది రాజా సాబ్ ట్రైలర్ అంచనాలను పెంచేసింది. మరి ఇవాళ (జనవరి 9) థియేటర్లలో విడుదలైన ప్రభాస్-మారుతి కాంబో సినిమా ప్రేక్షకులను మెప్పించిందా, కామెడీ, హారర్ అంశాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను నేటి ది రాజా సాబ్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఒకప్పుడు దేవనగర సంస్థానికి జమిందారు అయిన గంగాదేవి (జరీనా వాహబ్) సాధారణ జీవితం గడుపుతుంటారు. గంగాదేవితో మనవడు రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్) నివసిస్తాడు. నానమ్మ అంటే రాజుకు ఎంతో ఇష్టం. అయితే, గంగాదేవి అల్జీమర్స్‌తో బాధపడుతుంటుంది. కానీ, భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మరిచిపోదు.

కలలో కనిపించిన తాతను ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజును కోరుతుంది నానమ్మ. ఈ క్రమంలోనే హైదరబాద్‌లో కనకరాజు ఉన్నట్లు తెలిసి రాజు బయలుదేరుతాడు. నర్సాపూర్ అడవిలోని రాజ మహల్‌కి రాజు కొంతమందితో వెళ్తాడు. ఆ బంగ్లాలో ఎన్నో మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు రాజును చంపాలని చూస్తాడు.

మార్మిక విద్యలు తెలిసిన కనకరాజును రాజా సాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేంటీ? అతనికి ఏం కావాలి? రాజా సాబ్ లైఫ్‌లోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ధి కుమార్) ఎవరు? గంగాదేవి ఆస్తులు ఏమైపోయాయి? వారు సాధారణ జీవితం గడపడానికి కారణం ఏంటీ? బంగ్లా నుంచి రాజు బయటపడ్డాడా? అనేది తెలియాలంటే ది రాజా సాబ్ చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీని ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాగా డిజైన్ చేశారు. ప్రభాస్‌తో చెప్పించిన సెటైరికల్ డైలాగ్స్ బాగా పేలాయి. సినిమా ప్రథమార్ధం మొత్తం ప్రభాస్ వింటేజ్ లుక్, ఆయన మేనరిజమ్స్, కామెడీ టైమింగ్‌తో సరదాగా సాగిపోతుంది.

ముఖ్యంగా ప్రభాస్ పాత సినిమాల్లోని ఆ గ్రేస్ మళ్లీ ఈ సినిమాలో కొంతవరకు చూడవచ్చు. ద్వితీయార్థంలో కథ హారర్ వైపు మళ్లుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్‌లు, విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. హారర్ కామెడీ జోనర్ కావడంతో అక్కడక్కడా లాజిక్స్ మిస్ అయినట్లు అనిపించినా.. వినోదం విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.

బంగ్లాలో వచ్చే ఇల్యూజన్స్, వాటితో ప్రభాస్ టీమ్ పోరాడే తీరు బాగుంటుంది. ప్రతి ఒక్క హీరోయిన్ ఎంట్రీ కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్తా స్లోగా సాగుతుంది. అయితే, ప్రమోషన్స్‌లో చూపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలో లేవు. అది చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు.

కొన్ని చోట్ల హారర్ అంశాలు, కామెడీ ట్రాక్ బాగుంది. కానీ, పూర్తి స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించడంలో మారుతు సక్సెస్ కాలేదు. పాన్ ఇండియాకు తగిన స్టోరీ, బడ్జెట్ ఉన్న దర్శకుడు మారుతి సరిగా హ్యాండిల్ చేయలేదని ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. కానీ, సెకండ్ పార్ట్ దేనికోసం అనే భావన కూడా వస్తుంది.

నటీనటుల ప్రదర్శన

ప్రభాస్ ఈ సినిమాకు వెన్నెముక అని చెప్పొచ్చు. డార్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, విభిన్నమైన గెటప్స్ అభిమానులకు ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అయితే, కొన్ని చోట్ల డూప్ ఉన్నట్లు తెలిసిపోతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్‌లో ఆ ఈజ్, హుషారు కనిపించాయి.

హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తమ గ్లామర్‌తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు. కేవలం గ్లామర్‌తోనే మెప్పించారు. నిధి అగర్వాల్ డీసెంట్‌గానే చేసింది. రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ గ్లామర్ షో అట్రాక్ట్ చేస్తారు. సంజయ్ దత్ నటనతో ఆకట్టుకుంటుంది. బొమన్ ఇరానీ కనిపించేది కాసేపైన మెప్పిస్తారు. ఇతర పాత్రలు బాగా చేశారు.

సాంకేతిక విభాగం

తమన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం హారర్ సీన్లకు హైలెట్ అయింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది, ఆ పాత బంగ్లా సెట్టింగ్స్‌ను చాలా అందంగా, భయానకంగా చూపించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే

కానీ, కొన్నిచోట్ల గ్రాఫిక్స్ తెలిసిపోతుంది. నిర్మాణ విలువలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే హారర్, కామెడీ, గ్లామర్ షోతో అలా అలా మెప్పించే ది రాజా సాబ్.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More