ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూ- వింటేజ్ ప్రభాస్ బ్యాక్- మాళవిక ఫైట్ ఫైర్- భయపెట్టిన తమన్ బీజీఎమ్- సినిమాలో ఊహించని పాత్ర!
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూపై లుక్కేద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఎట్టకేలకు వెండితెరపై సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా భిన్నమైన హారర్ కామెడీ జానర్‌లో కనిపించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఇవాళ (జనవరి 9) థియేటర్లలో ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. ఈపాటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూలోకి వెళితే..!
మళ్లీ పాత ప్రభాస్ వచ్చేశాడు!
ట్విట్టర్ (ఎక్స్) రివ్యూల ప్రకారం.. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ ‘వింటేజ్ లుక్’ అందరినీ కట్టిపడేస్తోంది. "డార్లింగ్ ప్రభాస్‌లో ఆ పాత ఎనర్జీని, కామెడీ టైమింగ్‌ని మళ్లీ చూస్తున్నాం. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ రోజులను ఈ సినిమా గుర్తు చేస్తోంది" అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వేసిన స్టెప్పులు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మారుతి మార్క్ హారర్ కామెడీ
దర్శకుడు మారుతి తనదైన శైలిలో కామెడీని, హారర్‌ను కలగలిపి ప్రేక్షకులను అలరించడంలో సఫలమయ్యారని నెటిజన్లు పేర్కొంటున్నారు. "సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని హారర్ ట్విస్టులు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి" అని ఒక యూజర్ పేర్కొన్నారు. తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లాయని రివ్యూలు వస్తున్నాయి.
నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే?
"ప్రభాస్ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉన్నాడు. ఈ సంక్రాంతి విన్నర్ రాజా సాబ్!", "సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యింది. ప్రభాస్ తన వన్-మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు.", "కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది" అంటూ రాసుకొచ్చారు.
"ఫస్టాఫ్ అదిరిపోయింది. మాళవిక ఫైట్ బాగుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. తమన్ బీజీఎమ్ భయపెట్టింది. ప్రభాస్‌ను ఇలా చూపించినందుకు డైరెక్టర్ మారుతికి థ్యాంక్స్" అని ఒకరు రాసుకొచ్చారు.
"ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. తమన్ సంగీతం సీన్స్‌కు ఎలివేట్ ఇచ్చింది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ స్టన్నింగ్‌గా కనిపించారు. ఎవ్వరూ ఊహించని పాత్ర ది రాజా సాబ్‌లో ఉంది. సంజయ్ దత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది. హారర్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది" అని ఒకరు రివ్యూ ఇచ్చారు.
ఇలా ది రాజా సాబ్‌పై చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని అంటున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


