ప్రభాస్, దళపతి విజయ్‌ను ఓడించిన న్యూ హీరోయిన్- నెంబర్ 1 ఐఎంబీడీ పాపులర్ సెలబ్రిటీగా సారా అర్జున్- ఆ ఒక్క సినిమా ఎఫెక్ట్!
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘ధురంధర్’. ఈ మూవీ హీరోయిన్ సారా అర్జున్ తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. దళపతి విజయ్, ప్రభాస్ వంటి స్టార్లను ఓడించి మరి సారా అర్జున్ ఈ ఘనత సాధించడం విశేషం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా పేరే వినిపిస్తోంది. రికార్డుల వేటలో అలుపెరగని ఈ చిత్రం తాజాగా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సినిమాలో ‘యాలీనా’ పాత్రలో అద్భుతంగా నటించిన యంగ్ సెన్సేషన్, న్యూ హీరోయిన్ సారా అర్జున్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు.

దిగ్గజాలను ఓడించి మరి అగ్రపీఠం
ఐఎండీబీ (IMDb) తాజాగా విడుదల చేసిన ఈ వారపు పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు బ్యూటిపుల్ సారా అర్జున్.
ప్రతి వారం అభిమానుల ఆసక్తిని బట్టి ఐఎండీబీ ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ఈసారి టాప్ 1 ప్లేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె దళపతి విజయ్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి అగ్ర హీరోలతోపాటు అగస్త్య నంద వంటి స్టార్లను కూడా ఓడించి వెనక్కి నేట్టేసింది.
ధురంధర్‌తో సంచలనం
ఇదే దురంధర్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఐఎమ్‌డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో దళపతి విజయ్ (8వ స్థానం), అగస్త్య నంద (12), భాగ్యశ్రీ బోర్సే (15), యామీ గౌతమ్ (17), ప్రభాస్ (19) నిలిచారు.
హిందీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర
బాక్సాఫీస్ లెక్కల పరంగా ‘ధురంధర్’ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. బుధవారం (జనవరి 7) నాటికి ఈ చిత్రం భారతదేశం మొత్తం మీద రూ. 831.40 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ద రూల్’ హిందీ వెర్షన్ పేరిట ఉన్న రూ. 830 కోట్ల రికార్డును ఈ సినిమా అధిగమించింది.
"భారతీయ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయబడింది. ధురంధర్ అధికారికంగా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది" అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో సగర్వంగా పేర్కొంది.
సినిమా విశేషాలు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ చిత్రం కరాచీలోని లియారీ టౌన్ గ్యాంగ్ వార్ల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి అగ్ర నటులు యాక్ట్ చేశారు. ఇక దురంధర్ 2 సినిమాను మార్చి 19న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


