న్యూయార్క్‌లో దీపికా పదుకొణె రణ్‌వీర్ సింగ్- ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లో డేట్ నైట్- దురంధర్ సక్సెస్‌తో జోష్!
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అక్కడ జరిగిన ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లో డేట్ నైట్‌కు వెళ్లిన ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రణ్‌వీర్ నటించిన ‘ధురంధర్’ రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విహరిస్తోంది. శుక్రవారం (జనవరి 2) రాత్రి అక్కడి ప్రసిద్ధ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఎన్‌బీఏ (NBA) బాస్కెట్‌బాల్ మ్యాచ్‌కి డేట్ నైట్‌లో భాగంగా వెళ్లిన దీపిక-రణ్‌వీర్ ప్రత్యక్షంగా వీక్షించారు.

కోర్టుసైడ్‌లో తారల మెరుపులు
న్యూయార్క్ నిక్స్, అట్లాంటా హాక్స్ జట్ల మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ హోరాహోరీ పోరును దీపికా, రణ్‌వీర్ ఆస్వాదించారు. అక్కడ ఉన్న కొందరు భారతీయ అభిమానులు ఈ జంటను గుర్తించి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీపికా బ్లాక్ లెదర్ జాకెట్, స్మోకీ ఐస్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, రణ్‌వీర్ బ్లాక్ కోట్, బీనీ క్యాప్‌తో తనదైన ఫ్యాషన్ టేస్ట్‌ను చాటుకున్నారు. అయితే, వీరి గారాల పట్టి దువా ఈ మ్యాచ్‌లో వీరితో పాటు కనిపించలేదు.
ఎమోషనల్ పోస్ట్
వీరిని కలిసిన ఒక అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. "నా జీవితంలో ఇద్దరు నటీమణులను అమితంగా ఇష్టపడతాను. ఒకరు ఐశ్వర్యరాయ్, మరొకరు దీపికా పదుకొణె. దీపికా, రణ్‌వీర్‌లను చూడగానే నా గుండె కొన్ని క్షణాలు ఆగిపోయినంత పని అయింది" అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సునామీ
ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లో అత్యంత భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
దురంధర్ సినిమా ఇప్పటివరకు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. కేవలం అమెరికాలోనే 17 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం. దురంధర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణెతో ఎన్‌బీఏ డేట్ నైట్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ కవర్ స్పైగా
ఇకపోతే ధురంధర్ సినిమాలో పాకిస్థాన్‌లో అండర్ కవర్ స్పైగా రణ్‌వీర్ సింగ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ వంటి ఉద్దండులు నటించిన ఈ చిత్రం విడుదలైన నాలుగో వారంలో కూడా రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి హిందీ సినిమాగా చరిత్రకెక్కింది.
దురంధర్ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని తెలిసిందే. 2026 ఈద్ కానుకగా మార్చి 19న విడుదల కానుందని సమాచారం. మరోవైపు దీపికా పదుకొణె కూడా తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ సినిమాలో
షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలోనూ దీపికా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


