దురంధర్ 2 కాటు టాక్సిక్‌గా ఉంటుంది- యశ్ మూవీపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు- బాక్సాఫీస్ వార్‌పై ట్వీట్
2026లో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ గట్టిగా ఉండనుంది. రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాల మధ్య జరగనున్న క్లాష్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధురంధర్ 2’ దెబ్బకు ‘టాక్సిక్’ తలవంచక తప్పదనే అర్థంలో పరోక్షంగా సెటైర్లు వేశారు ఆర్జీవీ.
తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. 2025 బాక్సాఫీస్ విజేతగా నిలిచిన ‘ధురంధర్’ చిత్రంపై మొదటి నుంచి ప్రశంసలు కురిపిస్తున్న ఆర్జీవీ ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్ 2’కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ వదిలారు.

“ధురంధర్ దెబ్బ ‘టాక్సిక్’గా ఉంటుంది!”
అయితే, ఈ ట్వీట్‌లో ‘రాకింగ్ స్టార్’ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేసినట్లుగా కనిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది.
"ధురంధర్ 2 కాటు ‘టాక్సిక్’గా (విషపూరితంగా) ఉండబోతోంది" అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. అంటే, దురంధర్ 2 దెబ్బకు టాక్సిక్ తలవంచక తప్పదు అన్న అర్థంలో పరోక్షంగా యశ్ సినిమాపై సెటైర్లు వేశారు ఆర్జీవీ.
2026 మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు దురంధర్ 2, టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశాడని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా టాక్సిక్‌పై సెటైర్ల కారణంగా రామ్ గోపాల్ వర్మపై యశ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్రాలపై ఆర్జీవీ సెటైర్లు
బాలీవుడ్‌లోకి సౌత్ సినిమాల దండయాత్రను ‘ధురంధర్’ సినిమా అడ్డుకుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. "బాలీవుడ్‌లోకి చొచ్చుకొస్తున్న సౌత్ సినిమాల ‘ఫైర్ బాల్’ను దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలు (ధురంధర్)తో తన్నేశారు. ఇప్పుడు ఆయన తన కుడి కాలు (ధురంధర్ 2) సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం భయపెట్టి ఉంటే, రెండో భాగం వణికించబోతోంది" అంటూ ఆర్జీవీ ఇదివరకు రాసుకొచ్చారు.
రికార్డుల వేటలో ‘ధురంధర్’
ఇదిలా ఉంటే, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ 2025లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా దురంధర్ 2 మార్చి 19న రానున్న విషయం తెలిసిందే.
సవాల్ విసురుతున్న ‘టాక్సిక్’
మరోవైపు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కూడా అదే రోజున (మార్చి 19) విడుదల కానుంది. ఉగాది, ఈద్ పండుగల సెలవులను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ రిలీజ్ చేస్తున్నారు.
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇటీవల నయనతార లుక్ కూడా విడుదల కావడంతో టాక్సిక్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


