యశ్ టాక్సిక్‌లో కియారా అద్వానీ- తల్లి అయిన తర్వాత తొలి సినిమా- నదియాగా ఫస్ట్ లుక్ రిలీజ్- ఆ హాలీవుడ్ పాత్రలతో పోలిక!
‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ నుంచి కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ‘నదియా’ పాత్రలో కియారా అద్వానీ లుక్ అదిరిపోయింది. ఈ పాన్-ఇండియా చిత్రం 2026 ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అద్వానీ టాక్సిక్ ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..!
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Adults). ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. టాక్సిక్ మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను తాజాగా ఇవాళ (డిసెంబర్ 21) రిలీజ్ చేశారు.

నదియాగా కియారా అద్వానీ
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేస్తున్న ‘నదియా’ పాత్రను పరిచయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. కథానాయకుడు యశ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకుంటూ కియారాకు వెల్‌కమ్ చెప్పారు.
ఆకట్టుకుంటున్న కియారా లుక్
నదియాగా కియారా అద్వానీ అదిరిపోయే మేకోవర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో కియారా లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ ఆఫ్-షోల్డర్ గౌనులో, హై స్లిట్ కట్ డ్రెస్‌తో కియారా ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉన్న స్పాట్‌లైట్‌లో నిలబడి, కెమెరా వైపు కాకుండా ఎటో తీక్షణంగా చూస్తున్న కియారా కళ్లలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి.
హాలీవుడ్ పాత్రలతో పోలిక
కియారాకు ఉన్న ఈ ‘గోత్’ లుక్‌ను చూసిన ఫ్యాన్స్.. ఆమెను హాలీవుడ్ పాత్రలైన ‘హార్లే క్విన్’ లేదా ‘లేడీ జోకర్’తో పోలుస్తున్నారు. ప్రముఖ దర్శకుడు టిమ్ బర్టన్ సినిమాల్లోని పాత్రల మాదిరిగా ఆమె మేకప్ ఉందని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
తల్లి అయిన తర్వాత
ఈ ఏడాది తల్లి అయిన తర్వాత కియారా అద్వానీ నటిస్తున్న మొదటి సినిమా ఇదే. కొద్దిపాటి విరామం తర్వాత ఆమె నేరుగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుతో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. మరోవైపు యశ్ కూడా 2022లో ‘కేజీఎఫ్’ సిరీస్ ముగిసిన తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
బాక్సాఫీస్ రికార్డులు
సుమారు రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఈసారి ‘టాక్సిక్’తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అగ్ర నటీనటులు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీతో పాటు తారా సుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాక్సిక్ రిలీజ్ డేట్
టాక్సిక్ మూవీని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. 2026 మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సహా ఆరు భాషల్లో టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కియారా తెలుగు సినిమాలు
ఇకపోతే బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్, వినయ విధేయ రామ, మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












