షాకింగ్.. డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్- దురంధర్ మూవీనే కారణం- రూట్ మార్చిన దీపికా పదుకొణె భర్త!

బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ 3’ నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ధురంధర్’ సినిమా భారీ విజయంతో తన తదుపరి చిత్రాల విషయంలో రణ్‌వీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Dec 24, 2025, 14:34:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

షాకింగ్.. డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్- దురంధర్ మూవీనే కారణం- రూట్ మార్చిన దీపికా పదుకొణె భర్త! (Photo: Instagram)
షాకింగ్.. డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్ సింగ్- దురంధర్ మూవీనే కారణం- రూట్ మార్చిన దీపికా పదుకొణె భర్త! (Photo: Instagram)

డాన్‌గా మెప్పించాల్సిన రణ్‌వీర్

అయితే, ఈ భారీ సక్సెస్ ఇప్పుడు ‘డాన్ 3’ ప్రాజెక్టు ఎఫెక్ట్ పడింది. బాలీవుడ్ హీరో, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్’గా మెప్పించాల్సిన రణ్‌వీర్ సింగ్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బి-టౌన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

గ్యాంగ్‌స్టర్ పాత్రలకు బ్రేక్.. రణ్‌వీర్ కొత్త ప్లాన్!

దురంధర్’లో రణ్‌వీర్ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుసగా గ్యాంగ్‌స్టర్ లేదా యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం ఇష్టం లేకనే రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దిగ్గజ దర్శకులతో

సంజయ్ లీలా భన్సాలీ, లోకేష్ కనగరాజ్, అట్లీ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేయాలని రణ్‌వీర్ సింగ్ ఆశిస్తున్నారట. అందుకే, తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకునే క్రమంలో ‘డాన్ 3’కు గుడ్ బై చెప్పారని టాక్.

జై మెహతా ‘ప్రళయ్’కు గ్రీన్ సిగ్నల్

‘డాన్ 3’ నుంచి బయటకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ప్రళయ్’ (Pralay) పై పెట్టారు. ఇది ఒక జాంబీ థ్రిల్లర్ అని, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా అంటే 2026 జనవరిలోనే మొదలుపెట్టాలని రణ్‌వీర్ నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ల మార్పు

మరోవైపు ‘డాన్ 3’ టీమ్ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదట కియారా అద్వానీని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కియారా అద్వానీ ప్రసవం తర్వాత విరామం తీసుకోవడంతో ఆమె స్థానంలో కృతి సనన్‌ను ఎంపిక చేశారు.

కొత్త ‘డాన్’ కోసం వేట!

ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో మేకర్స్ కొత్త హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టారు. రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నా అనుకున్న సమయానికే డాన్ 3 సినిమాను పట్టాలెక్కించాలని ఫర్హాన్ అక్తర్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

షారుక్ ఖాన్‌తో

ఇకపోతే ఇదివరకు డాన్‌గా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సందడి చేసిన విషయం తెలిసిందే. డాన్, డాన్ 2 సినిమాల్లో అదిరిపోయే యాక్టింగ్‌తో షారుక్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాల్లో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఆకర్షించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More