ఓటీటీలో రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 2 సినిమాలు ఆమెవే.. తొలి స్థానంలో హారర్ కామెడీ

ఓటీటీలో రష్మిక మందన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఆమె నటించిన రెండు సినిమాలే గత వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య టాప్ 2లో నిలవడం విశేషం. ఆర్మాక్స్ మీడియా తాజాగా ఈ జాబితాను రిలీజ్ చేసింది.

Published on: Dec 22, 2025, 18:02:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో గత వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (డిసెంబర్ 22) రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక మందన్న నటించిన సినిమాలే టాప్ లో ఉండటం విశేషం.

ఓటీటీలో రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 2 సినిమాలు ఆమెవే.. తొలి స్థానంలో హారర్ కామెడీ
ఓటీటీలో రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 2 సినిమాలు ఆమెవే.. తొలి స్థానంలో హారర్ కామెడీ

ఓటీటీలో టాప్ 5 మూవీస్ ఇవే

ఓటీటీలో ప్రస్తుతం రష్మిక మందన్న నటించిన రెండు సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. వాటిలో ఒకటి హారర్ కామెడీ మూవీ థామా కాగా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఆర్మాక్స్ మీడియా ఈ జాబితాను రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న థామా (Thamma) మూవీ 3.1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.

ఇక రెండో స్థానంలోనూ రష్మిక సినిమానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ 2.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మూడో స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత ఉంది. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే ఉండగా.. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నాలుగో స్థానంలో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్ ఉంది. ఈ సినిమాకు 1.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

ఓటీటీలో టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే

ఇక ఓటీటీలో డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టు కూడా వచ్చింది. ఇందులో మాధురి దీక్షిత్ నటించిన మిసెస్ దేశ్‌పాండే టాప్ లో ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రెండో స్థానంలో ఉంది. ఇది 2.2 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రైమ్ వీడియోలో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ది ఫ్యామిలి మ్యాన్ సీజన్ 3 మూడో స్థానంలో ఉండగా.. దీనికి 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్ లోని కామెడీ డ్రామా సిరీస్ సింగిల్ పాపా కూడా మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ రాగా.. నాలుగో స్థానంలో ఉంది. ఇక అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోని భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్ 1.4 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More