ప్రభాస్‌లాంటి మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ చేసిన ఘనత రాజమౌళిదే: డైరెక్టర్ మారుతి కామెంట్స్‌.. ఫ్యాన్స్ సీరియస్

ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు డైరెక్టర్ మారుతి. ఓ మీడియం రేజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ ను చేసిన ఘనత అతనికి దక్కుతుందని పరోక్షంగా ప్రభాస్ గురించి చెప్పాడు.

Published on: Dec 28, 2025, 11:03:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో శనివారం (డిసెంబర్ 27) జరిగిన 'ది రాజా సాబ్' (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ లోని వాళ్లు మాట్లాడిన విషయాలు చాలా మందిలో ఆసక్తి రేపుతున్నాయి.ముఖ్యంగా వేదికపై డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. రాజమౌళి ప్రభాస్‌ను ఒక "మీడియం రేంజ్ హీరో" స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మార్చారని అనడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ప్రభాస్‌లాంటి మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ చేసిన ఘనత రాజమౌళిదే: డైరెక్టర్ మారుతి కామెంట్స్‌.. ఫ్యాన్స్ సీరియస్ (X/@rajasaabmovie)
ప్రభాస్‌లాంటి మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ చేసిన ఘనత రాజమౌళిదే: డైరెక్టర్ మారుతి కామెంట్స్‌.. ఫ్యాన్స్ సీరియస్ (X/@rajasaabmovie)

మారుతి కామెంట్స్ ఇలా..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య అట్టహాసంగా జరిగింది. అయితే ఎమోషనల్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో డైరెక్టర్ మారుతి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

తెలుగు సినిమా రేంజ్ గురించి మాట్లాడుతూ మారుతి ఒక ఉదాహరణ చెప్పాడు. "నేను సౌత్ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి నేను ఇండియా నుంచి వచ్చానని చెప్పాను. మా హీరో ప్రభాస్ తెలుసా అని అడిగాను. 'ఓహో బాహుబలి హీరోనా?' అని ఓ వ్యక్తి నన్ను అడిగాడు. అంటే మసాయి మారా తెగ వాళ్లకు కూడా ప్రభాస్ తెలుసు. దీనికంతటికీ కారణం రాజమౌళి గారు. ఈ రోజు అందరూ కాలర్ ఎగరేసుకుని పాన్ ఇండియా అంటున్నారు కానీ.. ఒక ‘మీడియం రేంజ్ హీరో’ని తీసుకుని, ప్రాణం పెట్టి పాన్ ఇండియా రేంజ్ కటౌట్‌గా నిలబెట్టింది రాజమౌళి గారే. ఆయనకు అందరూ రుణపడి ఉండాలి" అని మారుతి వ్యాఖ్యానించాడు.

ఫ్యాన్స్ ఫైర్.. సోషల్ మీడియా వార్

రాజమౌళిని పొగడటం ఓకే కానీ.. ప్రభాస్‌ను 'మీడియం రేంజ్ హీరో' అనడం ఏంటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మారుతికి కౌంటర్లు వేస్తున్నారు. "ప్రభాస్ నీలాంటి మీడియం రేంజ్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకో" అని ఒకరు అనగా.. మరొకరు "బాహుబలికి ముందే ప్రభాస్‌కు వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ కంటే ప్రభాస్ సక్సెస్ రేట్ బెటర్" అని వాదించారు.

మారుతికి మద్దతుగానూ..

అయితే కొందరు సినీ ప్రియులు మాత్రం మారుతి చెప్పింది ప్రాక్టికల్‌గా నిజమే అంటున్నారు. "బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ రాకముందు.. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల మార్కెట్ వేరు. అప్పట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ టాప్ లీగ్‌లో ఉండేవారు. బాహుబలికి ముందు ప్రభాస్‌కు 100 కోట్ల సినిమా లేదు కదా.. కాబట్టి మారుతి అన్న దాంట్లో తప్పు లేదు" అని కొందరు సమర్థిస్తున్నారు.

ఇక ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫాంటసీ హారర్ కామెడీ సినిమా.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More